ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
కువలయాశ్వచరిత్రము
ప్రథమాశ్వాసము
శా. శ్రీరాధాధరబింబసంభృత సుధాబృందాతిమాధుర్యగా
- థారీతు ల్బ్రకటించు లీల మురళీధౌరేయుఁడై గీతసం
- చారంబు ల్వెయించుకృష్ణుఁడు దయాసర్వస్వతాగౌరవం
- బూర న్సౌరమునారనాధిపుఁ జిరాయుశ్రీయుతుం జేయుతన్.1
సీ. తనమందహాసనూతనకాంతి కాంతకీర్తికలాపములను సంధించుకొనఁగఁ
- దనయాస్యపద్మంబు ధవరాగరసఝరీపటిమతోడుత మాటపలుకులాడఁ
- దనతనూదీప్తిసంతతులు నాయకమహస్తోమంబునకును విందులు ఘటింపఁ
- దనయురోజాచలత్వంబు మనోనాథకఠినధైర్యముతోడఁ గలసిమెలఁగ
- రాజులఁ దిరస్కరించుచు రమణుఁ డున్న, యరదమెక్కిన రుక్మిణీసరసిజాయ
- తాక్షి సవరము నారాయణాధిపేంద్రు, శుభదయాపూర్ణవీక్షచేఁ జూచుఁ గాత.2
చ. నెలకొనుజూటసౌరతటినీనవకైరవిణీవధూటితో
- లలితసుధాంశుఁ గూర్చినతలంబునఁ బార్వతిఁ గూడి యబ్ధికిం
- గలయికకుంటెన ల్నడుపఁగాఁ బనిపూనిన యాశపాలకుం
- డలశివుఁ డిచ్చుఁ గావుతఁ జిరాయువు నారనభూపమౌళికిన్.3
చ. తనతనుకాంతి కాంతజలదప్రతిమానగళాగ్రనీలిమం
- జెనక నరాంగరోచి నిజచిత్రసుధాస్మితపాండిమంబుఁ జి
- క్కనితమి ముద్దుఁ బెట్టుకొనఁగాఁ బతికౌఁగిట నున్నయద్రినం
- దన సవరంబు నారనజనప్రభు నెప్పుడుఁ బ్రోచుఁ గావుతన్.4
సీ. నుడుగులపూఁబోఁడి యడుగులబెడఁగు నిరీక్షించుచోఁ బదము పఠించుకొనుచుఁ
- బలుకుటొయ్యారి గుబ్బకవ గందపుఁబూఁత నెంచుచోఁ జర్చ వర్ణించుకొనుచు
- మాటమిటారి సయ్యాటంపునడ నిరీక్షించుచోఁ గ్రమము గుణించుకొనుచు
- మినుకుఁ బ్రోయాలి కింపునఁగీలుజవయల్లఁ జెరువుచో నలజటఁ జెప్పుకొనుచు
- వాణిశారీరరుచివైభవంబుఁ జూచు, వేళ వర్ణక్రమంబు భావించుకొనుచు
- నెమ్మి నగు తమ్మిచూలి మాతిమ్మనృపతి, పుత్రు నారాయణాధిపుఁ బ్రోచుఁ గాత.5
శా. వీణాదండచలత్కరోజ్జ్వలవిభ ల్వేల్లన్నఖోద్యద్రుచి