ఈ పుట అచ్చుదిద్దబడ్డది
36
కువలయాశ్వచరిత్రము
- నొకని కొకఁ డెచ్చరించుచుఁ జికిలియొఱలు
- పాఱవైచుచు వడిఁజొరఁబాఱువారు
- నగుచుఁ గైజీతములవార లనికి నిగిడి.143
క. దనుజులఁ గదిసిన నత్తఱి, జనితంబగు ధూళిపాళి చదలఁ బొదలఁగా
- ననిమిషకోటికిఁ గరములఁ, గనుదోయిం బులుముకొనుచుఁ గనుఁగొనవలసెన్.144
సీ. అరదము ల్దురదుర నరుచార నరుదేఱ నరదము ల్దురదుర నరిగె నెదురు
- కరులు ఘీంకారబంధురములై నడతేఱఁ గరులు ఘీంకారబంధురత నెదురు
- హరులు హేషాతిభీకరము లై పఱతేఱ హరులు హేషాతిభీకరత నెదురు
- భటకోటి చటులతోద్భటములై చనుదేఱ భటకోటి చటులతోద్భటత మీఱు
- సారథులు వ్రాలఁగొమ్ములు చదిసికూలఁ, బక్కెఱలు వ్రీలఁ గరవాలపటలి తూలఁ
- కేడి వారంగ నవి పోరు ఖేచరాళి, హర్షమునఁ జూడఁగా బొమ్మలాడినట్లు.145
మ. చదిసెం దేరులు పాఱె వారణము లశ్వమ్ము ల్ధరం గూలెఁ గం
- జెదకెన్ సైన్యము వ్రాలె బాహువులు ద్రెస్సె న్మాంసము ల్రాలె నం
- గదము ల్దీలెఁ గిరీటము ల్పఱచె రక్తశ్రేణి కయ్యంపుఁజొ
- క్కు దనర్పన్ భుజదర్ప మొప్ప నిరువాగుం జేరి పోరాడఁగన్.146
సీ. ప్రేగులుమీఁదఁ గన్పించి నవ్వెడు తలల్తూఁడులుగల తమ్మితుటుముఁ దెగడెఁ
- గెంపుటుంగరపుడా ల్గీల్కొన్నబాహువు ల్ఫణమణు ల్గలయహిప్రభులఁ దెగడెఁ
- బలు జముదాడి పోటులమించువక్షము ల్నెఱియ లానిన భూమినీటుఁ దెగడెఁ
- వ్రేటులరక్తము ల్వెడలించుతొడలు కుంకుమనీటి చిమ్మనగ్రోవిఁ దెగడెఁ
- దనుజమనుజేంద్రసైన్యముల్ దైన్య మెడలి, కయ్య మొనరింప సంగరాంగణము చూచు
- దివిజవర్యులు మొగములు ద్రిప్పికొనఁగ, నప్పు డమ్మక్క యనిపించె నమృతముగను.147
వ. వెండియు నుద్దండతరదండధరకోపాటోపవిభ్రమభ్రమితనయనభ్రమావహస్యంద
- నసహస్రసంగతరథాంగనికరాదభ్రవిభ్రమణవిధూతధూళీపాళికాధరాధురావ
- హగిరీశచరణకరీశ్వరంబును గరీశ్వరధారాధరక్షతజపూరపారావారదుర్వాగత
- రంగాయమానకనకపరికరంబును బోరనెడఁదగాయంబులవారలం గుంతసంఘ
- టితద్విపేటికాడోలికలం గొనిపోవువారును మున్నఱకమై నెక్కినకత్తలాణంబు
- లంబరులపాలు చేయనోపక డిగ నుఱికి కటారుల డొక్కలు విదారించి