ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
33
క. అలరాజు విజయ మెనయం, గలఁడని చంద్రుఁడును దారకావనితలతో
- గలహించి ముడియవైచిన, పొలుపలరన్ వేగుఁజుక్క పొడిచెం బెడఁగై.116
క. అంతట దనుజేంద్రుం డొక, దంతపుఁజవికె న్ప్రధానదైత్యులతోడ
- న్మంతనమాడుచు నృపుబల, వంతపువైఖరులు వేగువారలు దెల్పన్.117
క. పడవాళ్లఁ బిలిచి బలముల, వెడలింపుఁ డటన్న వారు వెసఁ జని నిద్రా
- జడులను బలాశి వీరుల, వడిగా మేల్కొల్పి ప్రకృతవార్తలు దెల్సన్.118
చ. అదరుచు వచ్చె నొక్కపలలాశి నిజాంగన సిగ్గుతోడి న
- వ్వొదవెడు చూడ్కిచేతఁ దనయుల్లములోని పునారతకియా
- భ్యుదయపువాంఛ దెల్పఁ గనుబొమ్మ నదల్చుచు మీఁదివేలుపు
- న్ముదితల నంటు దానిపయి ముందుగఁ జౌక ఘటించెనో యనన్.119
చ. ఒక దనుజాధినాథుఁడు మదోద్ధతి గంద మలందికొంచు గొం
- చక చనుదెంచె నుగ్రరణసన్నాహనంబున రాజమార్గణా
- ళికి నిఁకమీఁద డెందము బళీ యిరవౌనని ఱొమ్ముగోడపైఁ
- జికిలియొసంగి నన్నియలఁ జెన్నగు సున్నము వూయుకైవడిన్.120
గీ. విరులు సిగఁ జుట్టికొని యొక్కవీరదైత్యు , డరిగె నిఁకమీఁదఁ గల్గు కల్పావనీజ
- పుష్పములసారసౌరభంబునకు వాని, వలపునకుఁ బూని సరిచూడవలయు ననఁగ.121
క. ఈనేలచుట్టుఁ దిరిగినఁ, బోనీయఁడు రాజు పాఱిపోరాదనుతీ
- రూనఁగ నొకనక్తంచర, సూనుఁడు చక్రంబు ద్రిప్పుచుం జనుదెంచెన్.122
క. అనలోపమనృపశరముల, మొనలంబడి తరణిబింబముం జొచ్చుగతిం
- దనుజుం డొక్కఁడు గ్రక్కునఁ, గనకరథం బెక్కి యక్కు గ్రక్కుచు వెడలెన్.123
సీ. పడవాళ్లగమికిఁ జేపుడికి దబ్బఱనొప్పి పైవైచుకొని మూలఁబడినవారు
- నిండ్లలోనన యుండి యెటువోయిరో కాన మనిపించి కనిపించ కడఁగువారు
- నింటికావలికి న న్నిచట నిల్పరు గదా యని వేల్పులకు మ్రొక్కఁ జనెడువారుఁ
- దొలునాఁడె నృపునివార్తలు విని యొకలేనిపనిఁ బూని యెందెందొ చనెడువారు
- గ్రాసములు చెల్లలేదని గ్రాసిచేసి, కొలువుజీవితముల కొప్పుకొననివారు
- నగుచుఁ గోఁచపిశాచము ల్దిగులుపడఁగఁ, దక్కు రక్కసిదొరలు ముందఱను నిల్వ.124
సీ. నిలుచుండి వీణ చేతులఁ బూని తెఱగంటిబయకాఁడు మేల్కొల్పుపదముఁ బాడ
- నలుకుతో నాల్గుమోములదేవుఁ డొకయోర దినశుద్ది దెల్పి వేవెనుక కొదుగఁ
- దనయూరినుండి తెచ్చినపూలమాల జేజేలరాయఁడు చేరి చేతికొసఁగఁ