ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
31
- ధూమ్రబర్బరకేశ తుప్పుపట్టినఘోరజిహ్వ మిక్కిలివాఁడి చేసికొమ్ము
- కుటిలాక్ష మాంసంబు గొంతునఁ బడినోరు దెఱవ విప్పుడు సిగ్గు దెచ్చుకొమ్ము
- తడవులకుఁ గల్లె మనుజయూధప్రచండ, పలలపారణ తద్రక్తపానకేళి
- లాలనామోద మీసుమాళంబు మీఁ, వరుసనందఱు గంతులు వైవుఁ డింక.102
క. అని నన్నుఁ బనుప వచ్చితి, మనుజేశ్వర బారువెట్టుమా రాజుల ని
- వ్వని తూర్పుదెసకు మాదొర, చనుదెంచు న్శౌర్యవహనసన్నహనమునన్.103
గీ. అనినఁ జిఱునవ్వు నవ్వి యజ్జనవరాగ్ర, గణ్యుఁ డతనికిఁ గట్టువర్గం బొసంగి
- మంచి దటువలెనే నడిపించుకొంద, మంచు వీడ్కొల్ప నాదైత్యుఁ డరుగుటయును.104
గీ. అధిపతియుఁ జల్వలు ధరించి యారగించి, హితజనులు గొల్వఁ దగువారియిండ్ల కెల్ల
- గేలిగితి నేగి యిది వేళ కీర్తిమాట, వాసులకటంచు లాలించి వచ్చెనంత.105
సీ. బొంగులు నిల్పి యుబ్బుగఁ బైఁడివ్రాఁత బొమ్మలగుడారంబు లమర్చువారుఁ
- గొయ్యలు నాఁటి యాకులతోడిరెమ్మలు వాటంపుగుడిసెలు వైచువారుఁ
- బొక్కళ్ళవలెఁ గుంతములు చేర్చి యామీఁద గడితంపుఁ బచ్చడా ల్గప్పువారుఁ
- బచ్చిక ల్చెక్కుడుపాఱలఁ జెక్కి పూబొదరిండ్ల మున్నుగాఁ గదియువారు
- నచ్చముగ నీటికందువ లరయువారుఁ, పురుఁగుఁబుట్రలు చెదర నుబ్బుచును నొక్క
- పరిగ నవ్వుచుఁ జప్పట్లు చఱచువారు, నైరి తద్వేళఁ బాళెంబువారలెల్ల.106
సీ. రాతిరి పొక్కళ్ళ రౌలుకొల్పిన వహ్నిగలిగినపొగలు చీఁకట్లు గప్పె
- గాడ్పులచే నూఁదకయ బగ్గుమను శిఖు ల్నిగుడుచోటులు పట్టపగలు చేసెఁ
- దగవార్చి మూకుళ్ళ దిగువాఱనుంచిన కూటిబల్తావు లాగుబ్బకొనియెఁ
- బొరలించి చండ్రనిప్పులమీఁదఁ గాల్చిన కఱకుట్లవాసన ల్గ్రమ్ముకొనియెఁ
- ద్రోవఁ బోనీక బల్లెముల్ ఱువ్వి తెచ్చి, కడిగి జింకల వ్రేలాడఁ గట్టి తిత్తు
- లొలుచు భీభత్సరసము మహోగ్రమయ్యె, భుక్తి గొన్నట్టివారి త్రేఁపులు పొసంగె.107
క. చాలఁ గురంగటిమడుగుల, గాలాపున్వేఁటలాడఁగా దొరకినబ
- ల్మీలు చవిఁ దేల్చె నపు డా, పాలెంబున డిగిన బక్కబంట్రౌతులకున్.108
సీ. వలసినయెడకుఁ గమ్మలు వ్రాయు వ్రాయసంబులవారి గంటాల కిలకిలలును
- దొరవలంచిన కారృసరణు లెంచు నమాత్యకుంజరంబు లొనర్చు గుసగుసలును
- బొలదిండి రాయల యలవుల గనివచ్చి నిలుచు వేగులవారి కలకలములు
- నరుస కిందఱటంచు వంతులేర్పడియున్న బలకరంబులవారి యలబలములు
- నెపుడు వెడలునొకోయంచు నెంచి యాడఁ