ఈ పుట అచ్చుదిద్దబడ్డది
30
కువలయాశ్వచరిత్రము
- దీని పైయేడుసై సేసి నానువాని, చిక్కటారికొలారికచిస్తీరోలి
- రాజుపాలానవిను యిటు రాయటంచు, రాచదేవళ్ళు కెరలి విరాళిగొనిరి.94
గీ. అంత వాకెల్లఁ దత్కారణాభినూత, నాతివాచాటతాజ్యప్రభూతగోష
- వీతిహోత్రసముజ్జాతధూతికీలి, కాశ్రుతిస్ఫీతతామ్రాక్షు లగుచు లేచి.95
సీ. ఒఱలతోడుత దట్టిపొరల వంకులు డుస్సి తెలిచల్లడములతో నిలుచువారు
- నింటి కిమ్మని పిల్లబంటుచేతికి సొమ్ము లొసఁగి వీరావేశ మొందువారు
- ఔనన్నఁ జే వెళ్ళు మని హెచ్చరించుచుఁ జికటారి పొదలికె ల్సేయువారు
- దీని ముందరనొంచి వానిపైఁ బడువారు...........................................
- వాలు గొని లేచివచ్చు భూపాలుఁ ద్రోచి, యవ్వలిగుడారమున కేగుఁ డనుచుఁ జెనకి
- యతనిగద్దింపులకు భయమందువారు, నగుచు నందఱు దొమ్మిగా నరయుటయును.96
గీ. అంత నాలాడెజోగి మాయావిధిప్ర, పంచమంతయు నుపసంహరించి నిలిచి
- మునుపుఁ గొలువున్నవేళ నేయునికి నుండి, రట్లయుండఁగఁ గైవార మాచరించి.97
క. పాతాళకేతుఁ డంపిన, దూత న్నాసామి కెదిరి దురమున నిలువ
- న్నీతరము గాదు విను నీ, వేతెంచి బలంబుతోడ నిటు విడియుటయున్.98
మ. తనచారు ల్గని వచ్చి దైన్యమున నేతద్వార్త విన్పింపఁగా
- విని మీసంబులు దిద్ది దైత్యుఁ డహహా వీరా వడిన్వచ్చిపో
- రనునన్నుం గదియించువారు మఱి వారా నన్ను మార్కొందురం
- చనుమానింపక వచ్చి నిల్వఁగల వీరాగ్రేసరు ల్బాపురే!99
క. పెంపు విచారింపక విని, పింపఁగ రాదనక వచ్చి ప్రేలెడు వీరిం
- జెంపలు వేయరె యనుచు ని, లింపారి రి నిజాప్తులం బిలిచి యిట్లనియెన్.100
ఉ. వింటిరె యొక్కవార్త మనవెఱ్ఱులు చెప్పిరి తాము కన్నులం
- గంటి మటంచు నీతబిసిగాండ్రు మదీయమహోగ్రమాయకై
- డంటతనంబునం జని ఋతధ్వజు సైన్యసమేతుఁ దేర నా
- బంటుఁ దనంబుఁ బాపుటకుఁ బన్నినవా డఁట వాఁడు వాఁడిమిన్.101
సీ. గరళకంఠద్వేషి కరకకాయలు గొన్ని తినియైన నాఁకలి దెచ్చుకొనుము
- దేవేంద్రమదభేది తెలిచాయ గలకోర పంటిమొన ల్సానఁ బట్టుకొమ్ము