ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
29
- యొకతిత్తి బరదేశుల కొసంగఁ గూర్చిన రసవాదపు మెఱుంగుఁ బసిఁడి బుడ్లు
- కొండవలె నెత్తిపైఁ జుట్టుకొన్న జడలు, వెండికట్టులబెత్తంబు విడెముమీఁచ
- వీడియముగల్గుదొర పాతలాఁడెజోగి, బిలికొని వచ్చి పొడఁగనిపించుటయును.88
గీ. పతి కరముఁ జూప రత్నకంబళముమీఁదఁ, గడవసము వైచి కూర్చుండి బుడుతవీచు
- సురటిగాడ్పుల నుదుటికస్తూరిబొట్టు, రవలు రాలంగ నాతఁ డారాజుఁ జూచి.89
సీ. ఇది చేత నుండిన నిసుమంతవడిలోన నేదేశమునకైన నేగవచ్చు
- నిది మోళిపై నున్న నెదుటి చేవెళ్ళిన వైరికైదువజాఱి దారితప్పు
- నిది దట్టిపొఱ నున్న నెటునంటిరూపైనఁ బ్రాపించి వేడుకఁ జూపవచ్చు
- .........................................................................................
- ...........................................................................................
- .............................బదనిక లొసంగి యొకమాయ పన్నుటయును.90
ఉ. కంటెఁ దగిల్చినట్టికొన గల్గిన చందురుఁగావి జాళువా
- జంట పయంటపై నిగుడి చక్కని జక్కవ నిక్కు చొక్కపుం
- జంట చెలంగు బంగరువు చాయలు దూచియనంగఁ జాలు వా
- ల్గంటి మెఱుంగుఁ జూపులు దళారన వచ్చె మహాద్భుతంబుగన్.91
ఉ. చొక్కపుఁ బంజుకమ్మల రుచు ల్మెఱుఁగెక్కిన చెక్కు జాలువా
- నక్కులచక్కుజక్కిణిగొనం బిగిగుబ్బలు పిక్కటిల్లఁగాఁ
- జుక్కలరాచడాలు తెలిచూపులు త్రొక్కనిచోట్లు ద్రిక్క నా
- చక్కెరబొమ్మ యమ్మహిపచంద్రుని చక్కటి కేగి గ్రక్కునన్.92
ఉ, రంగు చెలంగ గుబ్బల ధరాస్థలివక్షము మోపలేమి సా
- ష్టాంగ మొనర్ప సిగ్గువడె నంచు నభంగురపాకభిన్మణీ
- సంగతకంకణారవము చాటఁగఁ బైటచెఱంగు కేలితో
- ముంగలఁ గొంకుచుం గొలువుమొక్కు ఘటించి పిఱింది కేగినన్.93
సీ. సయిదోడ చూడు నస్సాయ యిట్లేజ యిట్లేశవోజులపతి యింగిలయ్య.
- [1]జగ్గుమంటివి వచ్చిశాణ నిద్దాహుంత్త కారి బుర్సాపుత్త గాలిసుమ్మ
- అట్టె చూస్తుండది యదెనన్నెమోసిలి గలవాఁడ నని యదిగాక గడిని
- చిక్కారిసాదన జేసెనదియింన్న దోభాజలల్ల మెలుద్రిబజారి