ఈ పుట అచ్చుదిద్దబడ్డది
26
కువలయాశ్వచరిత్రము
ఉ. ఎండదినంబులం బడగ లించుక నీడఁగఁ బట్టి మౌనులం
- గొండొక సేదదీర్చు ఫణికోటులఁ జేరి యిదేటి కార్య మౌ
- లెండు మ ఱేమి మే మిచట లేమె యటంచు మరల్చి చెల్వుమై
- నింక మయూరిక ల్చికిలినిద్దపుఱెక్కల వీచు నక్కడన్.65
మహాస్రగ్ధర. జనవన్మౌనీంద్రవేదాక్షరయుత తతహస్తస్రువాజ్యాహుతిప్రో
- ద్భవవహ్నిస్ఫారకీలాప్రకటితకరదీపప్రభ న్వత్తు రౌరా
- హవిరర్హాహూతు లింద్రాద్యమరు లననికై యాస ప్రేరేపఁగా మీఁ
- దివపాంచద్ఛీమధూమస్థితులు నిబిడమై దృష్టి చీఁకట్లు గప్పన్.66
క. వేలిమియగ్గిపొగల్దగు, వేలుపు డిగ్గి యమునింగి వెలువడు నమరీ
- జాలము తిన్ననిపెన్నెఱి, వాలుఁగురుల కగరుధూపవైఖరి యగుచున్.67
చ. ఇనహరిణాంకరశ్మి కెడబాయని యవ్వనిఁ బంకజాకరం
- బునఁ గవజక్కవ ల్వగవఁ బ్ద్దులు గ్రుంకుట దెల్లవాఱుట
- ల్గనమి బలాగవర్షి కులకాంతలమోమను కల్వరాయనిం
- గనుఁగొని విచ్చిపోవుటయె గాని వియోగ మెఱుంగఁ దెన్నఁడున్.68
చ. అని తెలుప న్మహీశుఁ డవుఁగా యని మెచ్చి పటానితేజి డి
- గ్గినతఱి మూఁగి గచ్చు టరిగె ల్తెలిపావడ వైచి యచ్చపుం
- బని మగఱాతిచెక్కడపుఁ బావలు నిల్పినవారలం గనుం
- గొని యటు నిల్పి యాప్తులొకకొందఱు వెంటనె రా ముదంబునన్.69
క. చని నృపతి గనియె మునిజన, వనితాజనతానితాంతవర్ధితకేళీ
- ననపాళీ కుసుమాళీ, జనితాళీనలినఘనము సంయమివనమున్.70
క. కని పర్ణశాలమ్రోలకు, జని యచ్చటివారిచెంత సంయమిపతికిం
- దనరాక తెలియఁజేసి త, దనుమతిచే వేగఁ జని తదంతరసీమన్.71
సీ. అచ్ఛదంతేచ్ఛవి యామస్తకన్యస్తభసితాభఁ జేరి కేకిసలు గొట్ట
- మోధావిరుచి గండమిలదురుశ్మశ్రురుక్చయములఁ జప్పట్లు చఱచి నవ్వ
- జడలఁ బర్వినడాలు శారీరధారాళకాంతులఁ గికురించి కన్ను మూయఁ
- బటునఖద్యుతి కరస్పటికాక్షమాలికాచ్ఛాయల డాసి కేకేయనంగ
- నవ్యశార్దూలచర్మాసనంబుమీఁద, యోగపట్టె బిగించి కూర్చున్నవాని
- గాలవుని గాంచి చేనున్ను కత్తి మంత్రి, యందికొనఁ జేరి సాష్టాంగమాచరించి.72
క. నిలిచినఁ గనుఁగొని నరవర, కులపావన యిందువచ్చి కూర్చుండవనా