ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
25
- య్యనఁ గను మూసి కన్ దెఱచునంతటిలో మునిసీమఁ జేరఁగన్.58
క. అరుగఁ దదీయమనస్ఫుర, దరవింద మరందబృందమై మధురసుధా
- చిరకందమై యొకానొక , పరమానందంబు హృదయబంధం బొందన్.59
సీ. మధ్యసంధ్యాస్నాన మౌనీంద్రలూన తాపసగంధపవనంబు భ్రమరివాఱె
- నంబుపర్ణసమిత్కుశాయాతవటుజాతసమదనాదంబు మీసంబు దీఁటె
- సవన ధూమాబ్దవీక్షణనటత్కేకికాంతావిలాసము తొడ ల్తట్టుకొనియె
- నన్యోన్యవైరాసహమృగేంద్రమత్తవేషండకేళికలు పంతములు వలికె
- నీకరణిమున్నుగాఁ బరాకిడియె మౌని, యాశ్రమంబని తన్మార్గ మభినుతింప
- మోదమునఁ దేలి నృపమౌళి మోము చూడఁ, జనవు మైఁజేరి నిజకేళి సచివుఁ డనియె.60
సీ. చలువలు నించు నచ్చపుమంచుఁ జిలికించు ఱేరాయఁ డెడ లేర్పఱించువాఁడు
- గలభి గాకుండ వేల్పుల నొక్కనొక్కనిఁగా ధనరాజు వెలినుండి యనుపువాఁడు
- వారివారిప్రభుత్వతారతమ్య మెఱింగి గిరిశుండు బంతిసాగించువాఁడు
- ప్రొద్దుపోయెను జూచి భుజియింపుఁ డని దేవపతి యుపచారము ల్పలుకువాఁడు
- తగినవారల వీక్షించి తమ్మిబోఁటి ఱేఁడు మాటికిఁ జవు లెచ్చరించువాఁడు
- జనవరాఖండలా యిందు సంయమీంద్రకాండకృతమైన సత్రయాగంబులందు.61
చ. మునివనిత ల్శచీముఖతమోనిభవేణులకుం బతివ్రతా
- జనతతిఁ దెల్పుచోఁ బరవిచారము గాచని వేల్పుటొజ్జజ
- వ్యనిమొగ మడ్డముంజోనుప వారలు నవ్వుచు రామె సిగ్గుపెం
- పునఁ డలవంపఁ జందురుఁడు పొంగగ నిచ్చట యాగవేళలన్.62
సీ. సాలీఁడు గాఁబోలు సమదవేదండంబు తెలినారచీకలు డులిచి తెచ్చుఁ
- బనివాఁడు గాఁబోలుఁ బటుఘోణిపోతంబు బలుమోర నివ్వరి కలుపుదీయు
- గొల్లఁడు గాఁబోలు భల్లూకపాకంబు మేలిజన్నపుఁబసి మేఁపి తెచ్చు
- జనవరి గాఁబోలు గొనబుఁబ్రాయపుజింక యలరిపై పారుపత్యంబు జేయుఁ
- గూలిగొను నొజ్జకాఁబోలు గొదమచిలుక, తపసిబుడుతలగమికి వేదంబు నుడువు
- సుసరముగఁ బారికాంక్షు లేజోలి లేక, జపతపంబులు సాగింప జనవరేణ్య.63
చ. మునివరు లేగ వెంట మృగము ల్నదికిం జని యంతనంత మే
- పున కటు నిల్చుతు న్నియమపూర్ణత వారు నిజాశ్రమాళికిం
- జనినఁ దదార్ద్రబంధురవిశాలజట ల్ధరజీరుకాడ వె
- న్కొని చెవి బక్కరించి యుఱుకుం బొడకట్టినవెల్ల దాటుచున్.64