ఈ పుట అచ్చుదిద్దబడ్డది
24
కువలయాశ్వచరిత్రము
సీ. పటుచక్రగతి నేలపాఁతు పెల్లగిలంగ విమలమణిస్యందనములు దనర
- మావటీలకు మింటిదేవత ల్మంత్రాక్షతము లీయగ జయూధపములు వెలయ
- ధారాసమున్నమద్ధవళ చామరలు ఱెక్కలభంగిఁ దగఁ దురంగములు సెలఁగ
- జయలక్ష్ముల వరింపఁ జను పెండ్లికొడుకుల గుంపులై భటరాజకోటి యొనర
- నడచి తమగపుబైట సన్నాహమెల్ల, నమరఁ బౌజులు దీర్చి నిజాప్తమంత్రి
- వరముఖాంతరమున సరివారితోడ, మాటలాడించుకొనుచు సామంతనృపులు.52
చ. గొనబుపసిండికీ లరిగెగుంపులనీడ వసింప నంతలో
- జనపతి మేలుకాంచి హరిచందనగంధిలమైనవారిఁ గుం
- దనపుమెఱుంగుగిండ్ల వనిత ల్గొని తన్ముఖమజ్జనంబు నిం
- పొనరఁగఁ దీర్ప నద్ద మొకయుగ్మలి పూనఁగ నామతీర్థమై.53
చ. మినుకుఁ గడానితాయెతు సమేళపుఁగ్రోవ్విరిదిండుదండ డా
- ల్పనివలెవాటు చల్వనలిపంపురుమాలువు గట్టి దట్టిఁ జె
- క్కినవిడి కెంపువంకి జిగి కెంపగు దుప్పటి దాల్చి యీతఁడే
- మనసిజుఁ డాయన న్సొగసుమార్గముగాఁ గయిసేసి వేడుకన్.54
సీ. సమదవేత్రకరాతిసాహోనినాదంబు గదలివచ్చెనటంచు మదికిఁ దెలుపఁ
- జామరగ్రాహిణీసరళకంకణరాన మివలి కేతెంచె నంచెఱుక సేయఁ
- గమనీయయవనికాకాంచికానిస్వాన మల్లన వచ్చెనం చానతీయ
- సంగీతవిద్యావిశారదాగానంబు లిదె యరుదెంచెనం చేర్పరింపఁ
- జనవరులు లేచి నిల్వ హజారమునకు, నరిగి చౌకట్లముత్యాలయందుహస్త
- మిడఁగఁ గొల్చుచు నిలిచి సాహిణులు మ్రొక్కి, తెచ్చి ముందఱఁ దొలునాఁటితేజి నిల్ప.55
క. వడిఁగట్టికవారలు పా, వడ మిడి హెచ్చరిక రాయవరగండ యనన్
- బెడయంకెవన్నెపైఁ గా, లిడ కపుడు చివుక్కుమనఁగ నెక్కెం దేజిన్.56
మ. చనవు ల్మీఱఁగ మ్రోల నూల్కొలుపు బల్సామ్రాణిధూపంబు వా
- సనకు న్వేలుపుముద్దరాండ్రు కచము ల్జార్పంగఁ బుణ్యాంగనా
- వనజిన్యబ్జకరాపతచ్ఛితమణు ల్వర్ణింప ఛత్రంబుపై
- ననువౌ బంగరుగుబ్బప్రొద్దుఁ దలఁబ్రాలై ముంచఁ జంచద్గతిన్.57
చ. జనవరమౌళి కొంతవడి సాహిణి నివ్వెఱగంది చూడ జో
- డన రవగాలు చూపుచు హుటాహుటి నేగిపరాకు వీరువీ
- రని తముఁ దెల్ప నందఱు రయంబున వెంబడ వాగె సళ్ళియొ