ఈ పుట అచ్చుదిద్దబడ్డది
22
కువలయాశ్వచరిత్రము
వ. అక్కటా దిక్కటాహంబు లొక్కగ్రక్కున మెక్కందలంచు ముక్కంటిటె
- క్కున యక్కటికంబఱి యిక్కటికిరాతిగుండియ నగ్గలపుటలుక యొగ్గి బగ్గుబగ్గు
- రుమన శమనదనుజుక మన సంధానకరంబగు పరుషాక్షరంబున శపియింపంబూను
- నావదనంబున సరస్వతీశంబరనయన దుడిదుడి వెడలఁగడంగునెడ జడధినసనాని
- రాలంబనజనితంబుగు నొక్కవచనం బీవిధంబున వినంబడిన నాకర్ణించితి.36
చ. పదరకుమన్న మౌనికులపానన కుమ్మరి కొక్కయేఁడునుం
- గుదియకు నొక్కపెట్టు నని కోవిదు లాడరె ఘోరసాధనా
- భ్యుదితతపోబలం బిటులయో యొకరక్కసుపాలు చేతురే
- మది మదినుండి మే మెఱుగమా మఱి వీని ఖరాపరాధముల్.37
గీ. ఐన నేమాయె గనుక ధరాధిపతులు, చేయఁదగినట్టి యీదుష్టశిక్ష నీకుఁ
- బడినభారంబె పాఱెడుబండ్ల కెదురు, కాళ్లు సాతురె యో వెఱ్ఱికాన వినుము. 38
చ. ఇదె హరి యాఋతధ్వజనరేంద్రున కి మ్మిపు డానృపాలుఁడే
- కదనములోన వీనిఁ గడికండలొనర్పఁడె నీకు నేటి కీ
- యెదవడనన్నమాట యొకయింత వినంబడునంత మాత్ర నే
- కదెయఁగ వ్రాలె నొక్కతురగంబు వియత్తలినుండి యత్తఱిన్.39
క. పతయాళుతురగవభృతో, న్నతకర్ణద్వయమునందునం గెంపులమే
- ల్పతక మమరె రవికిరణం, బతిరయమున ననుపవచ్చు ననువు నటింపన్.40
చ. కనుఁగొని దాని ఫాలఫలకంబునఁ గట్టినపత్రికన్ లిఖిం
- చిన వివరంబుఁ జూచి సరసిజహితుండు దయాళుఁ డన్ప వ
- చ్చిన దిది యంచు భూవలయసీమ దిరంబును జుట్టివచ్చునం
- చనఘ తదాఖ్యయుం గువలయాశ్వ మటంచు నెఱింగి నెమ్మదిన్.41
సీ. వరదానములకునై వచ్చు వాక్ప్రియకారి ముచ్చాయ లెఱిఁగించు మొగము దెల్ప
- యాగభాగాసక్తి నరుదెంచుపాకారి యేఁకారి యిది మీకు నేల యనఁగ
- వనవిహారాపేక్ష వచ్చు క్రొన్నెలదాల్పు జక్కిమార్పులకు హెచ్చరిక పడఁగ
- మునులసేమ మెఱుంగఁ జనుదెంచు కరివేల్పు దండనాథుని సమాధాన మనుప
- విని వినమి చేసి పని గలదనుచు వారిఁ , గూడదని త్రోయవలెఁ గద యేడజోలి
- మాకు నేటికి వారితో మచ్చరంబు, సొమ్ము సొమ్మునఁ గూడఁ జేర్చుటయె నీతి.42
చ. అని తలపోసి యే నిటు రయంబునఁ దెచ్చితి నత్తురంగముం
- గనుఁగొను మిత్తురంగము వికల్పితనిష్టురహేషచేఁ బరా