ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20
కువలయాశ్వచరిత్రము
- వినయంబుతోఁ జేరి పని యేమి యనువాఁడె యరయ కడ్డాదిడ్డు లనుపసాగెఁ
- దనవచోదోషము క్షమింపుమనెడువాఁడె, యేమనిన లేని నాతప్పు లెంచసాగె
- వినుము మహికాంత కొండంతపనికి నైనఁ, బలుకులేటికిఁ గిల్లాకు పనుపసాగె.24
చ. ఇటు లతఁ డున్నయంత ధరణీంద్ర యొకకానొకనాఁడు నాకురం
- గట నడయాడు నొక్కమృగకాంతకుఁ బ్రొద్దులవేళ చాలఁ జే
- రుటకతనం దపోధనసరోరుహలోచనలంచఱు న్సము
- త్కటగతి ముచ్చట ల్నిగుడఁగాఁ గడగానని సంభ్రమంబునన్.25
సీ. ఎన్ని న్చేనది తానిన్నటిమొటికగా యాకొమ్మఁ గడకుఁ బొమ్మనఁగదమ్మ
- పడుచుదూడలచేతఁ బనియౌనె వీ రేల యనసూయఁ దోతేరఁ బనుపరమ్మ
- యీప్రొద్దు నక్షత్ర మేమిలగ్నము మంచిదేయంచుఁ దగువారిఁ దెలియరమ్మ
- శుద్ధవేళ సుఖప్రసూతి గావలెనంచు నిలువేల్పులకు మీఁదు లెత్తరమ్మ
గీ. అనుచు గుమిగూడి మృగి నొక్కయలరుఁదోటఁ
- బూవుఁబొదరింటఁ దార్చియింపులు జనింప
- నున్నతఱి మాయ గైకొని యట్టెపడిన
- సరణిఁ జెట్టునఁ దెగిపడ్డ కరణివాఁడు.26
సీ. తళుకుటద్దపురంగు గలచెక్కులబెడంగు మేలికమ్మలడాలు పాలు చేసి
- తొగరుఁగెంపులపెంపు నగు మోవి నెఱసొంపు పసని ముక్కఱనిగ్గుపాలు చేసి
- సింగంపుగతిఁ బూను చిన్నారి చేఁగౌను బంగారుమొలనూలు పాలు చేసి
- వలిజక్కవలఁ గేరు వలువగుబ్బలతీరు పసిఁడిపైఁటచెఱంగు పాలు చేసి
- తనరెఁ గనుఁగొంటిరమ్మ యివ్వనిత యనఁగఁ, దగిన కాంతావిలాసంబుఁ దాల్చివచ్చె
- గిలుకుమట్టెలురవలు పావలు నుజిటులు, విడెము మడమలఁబడుకీలుజడయు మెఱయ.27
చ. చెలువగు ముద్దుటుంగరపుఁ జే నెఱికుచ్చెలఁ బట్టి యుబ్బుగు
- బ్బలజిగి జాలువాఱవికె పక్కున వ్రీలఁగఁ బైఁటవాటుగా
- నలవడఁ గొంకుఁజూపులు నిజాంఘ్రినఖాళిఁ గల్వదండఁగాఁ
- జెలువలచెంతకుం జనియె సిగ్గులపెండ్లికొమార్తయుం బలెన్.28
సీ. కూర్చున్నవారు లోఁగుచు లేచి చేఁజూపి యిందు రమ్మని ప్రియం బెనయఁ బలుక
- నిలుచున్నవారు చెంతలఁ జేరి స్వస్తి భవత్యై యటంచు దీవన లొసంగ
- ననల మాటాడువా రదరిపాటున మర్లి యొఱపు వీక్షించి నివ్వెఱపడంగ .
- నపుడు వచ్చినవార లౌ చెలి యెవతె యీకొమ్మ యంచును గుసగుసలు వోవ