ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
19
- రంగు మెయిచందము మెఱుంగు మొగమంచము చెలంగ నునుగందము పొసంగ నిదిగో మీ
- చెంగటనె నిల్చెను దురంగమము వచ్చినతెఱంగు నెఱుఁగంగఁ బలుకంగదవె మౌనీ.16
ఉ. నావుడు మోమున న్మొలకకన వ్వొలుకం దమవారిఁ జూచి యా
- హా వినయంబు గంటిరిగదా యనుచుం దలయూఁచి యాగదీ
- క్షావిధిమత్సమిత్సమితికర్షణకర్కశమైనకేల నా
- భూవిభుమేను తట్టి మునిపుంగవుఁ డిట్లనియెం బ్రియంబునన్.17
ఉ. అంతటివాఁడ వౌదువె కదయ్య తలంపఁగ శత్రుజిన్మహీ
- కాంతునిపట్టివే యఁట యఖండమదారివిదారణక్రియా
- కాంతపరాక్రమంబు లడుగన్వలెనే మఱి యీదిగంతవి
- శ్రాంతసుధీవిధేయగుణసంగతి నీకె తగుం గుమారకా.18
చ. చలదరితావకీనభుజశౌర్యము పెట్టనికోటయై ముదం
- బలవఱపంగ యాగహవిరాహరణార్థనిమంత్రణక్రియన్
- బిలిచినఁ గాని రాఁడు బలభేదియు నేఁటిదినంబుదాఁక నో
- కులనగధీర యీనడుమఁ గొన్నివిశేషము లెన్న శక్యమే.19
క. పాతాళకేతుఁ డనియెడి ఘాతుకుఁ డొకరక్కసుండు గలఁ డంబుధర
- వ్రాతారవనీతాహవ, భీతానవధానసకలబృందారకుఁడై.20
క. ఫలకుసుమబిసాదులు గం, పలకొలఁదులు దెచ్చుకతన మాలిమికాఁడై
- నిలుకడఁగ మాతపోవని, మెలఁగుచు వాఁ డుండియుండి మెల్లనఁ బిదపన్.21
గీ. మామకానూనజపహోమమౌనసంవి, ధానముఖమైన నియమసంతాన మనెడి
- పద్మవనవైరికళ మాటువఱప నేఁడు, రాహువైనాఁడు వాఁడు ధరాతలేంద్ర!22
సీ. ఒకఁ డైనఁ గని యెఱుంగకయుండ విదళించు సారనీవారకేదారసమితి
- వెనుకవేళలు గాచి కని కానమిగ దాఁచు నటవిఁ దాపసుల మృగాజినమ్ము
- లాపిమ్మటను గొంద ఱది యేమి యనఁ ద్రుంచుఁ బర్ణశాలాసమీప ద్రుమాళి
- బిదప నందఱుఁ జూడఁ గదిసి కైకొనసాగు యాగకల్పితహవిర్భాగతతులు
- రచ్చ సేయఁగఁ దొరకొను రాత్రులందు, మునికుమారుల బెదరించి కొనఁగ దొడఁగుఁ
- గామినీమార! వాఁడు నిక్కముగఁ జేసె, నిందు రమ్మన్నచోట నిల్లెల్లఁ గొనుట.23
సీ. పొడగన్న సాష్టాంగముగ వ్రాలి చనువాఁడె యెదురుగా రారంచుఁ బదరసాగెఁ
- బిలిచిపెట్టిన వన్యభిక్ష గైకొనువాఁడె కోరి పెట్ట రటంచుఁ గొణఁగసాగె
- నిలుచుండి చంక చేతులు కట్టుకొనువాఁడె కొలువరా రేమంచుఁ గెలయసాగె