ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18
కువలయాశ్వచరిత్రము
- దిక్కులనుండి యేతెంచు మన్నీలమంత్రులతోడ నుచితంపుఁబలుకు పలికి
- సమయోచితముగ హాస్యము లొనర్చు విదూషకులదిక్కు మొలకనవ్వొలుకఁ జూచి
- యవసరంబులవార లవధారనుచుఁ దెల్పఁ బొడఁగనివారి కింపులు వెలార్చి
- సత్కవీంద్రులు రచియించి చదువు పద్య, సమితియం దోరపారలు చక్కదిద్ది
- ప్రౌఢి గనిపింపఁజేయు భూపాలుకొలువు, ప్రజల కవ్వేళఁ గన్నులపండువయ్యె.9
చ. ఇటువలె నున్నవేళ ధరణీంద్రునిమ్రోలిక వేలనీల సం
- ఘటితఖలీనలీన సుముఖచ్యుతఫేనవిరాజి తేజి యొ
- క్కటి తుదివాగె పూని వెనుకం గొనిరా మునిరాజు వచ్చె న
- చ్చటికిని గాలవుండు పరిషత్పరిషక్త మహాద్భుతంబుగన్.10
మ. జలజాప్తోపమతేజ మంజలిపుటీసంధానము న్సంభ్రమా
- కలితోద్ధానము భక్తిపూర్వకనమస్కారంబు నామ్రేడితో
- ద్గలితాంతసేతుతివారముం జలుప శిక్షాదక్షమై సభ్యవ
- ర్యులకు న్నెయ్యము నింప సంయమివరేణ్యుం డొయ్యనం జేరినన్.11
క. ఎదురేగి శిరోగ్రము త, తృదయుగళము సోఁక నృపతి ప్రణమిల్లి ప్రియం
- బొచనఁగ నర్ఘ్యాదికవిధి, నెద రంజిలఁజేసి వినయ మెసఁయఁగ ననియెన్.12
క. క్షేమమె కద భవదాశ్రవ, భూమి న్నీవారవారిపూర్త్యమిథస్సం
- గ్రామారంభమృగేంద్ర, స్తోమంబులకెల్ల నోవిశుద్ధచరిత్రా!13
శా. స్వామీ మీసుముఖత్వమే కుశలవాచారీతిఁ గన్పించు నే
- నా మీరాకకు నన్యకారణము గాన న్నన్ను ధన్యాత్మునిం
- గా మోదంబునఁ జేయవచ్చితిరి తక్కన్వక్లు కామత్వ మి
- ట్లేమేనున్న నుపేక్ష సేయకయ మౌనీ యానతీవే దయన్.14
సీ. ఐశ్వర్యగతిమీఁద నరుచి పుట్టినఁగాని బలహంత మీచెంత నిలువ వెఱచుఁ
- జక్కఁదనంబుపైఁ జౌక దోఁచినఁగాని సురభామ మీసీమ చొరఁగ వెఱుచుఁ
- దనపేరుమాత్రంబు కనరు వేసినఁ గాని హరిపట్టి మిము గిట్టి యరుగ వెఱచు
- విబుధధామముమీఁద వెగటు గల్గినఁ గాని ననజారి మిముఁ జేరి చెనక వెఱచుఁ
- గానఁ దావకనియమవిఘ్నంబు నడుగ, నలికెదనుగాని యోమౌని యట్టులేని
- ఘోరమామకతూణీరగుప్తశాత, శరమునకు నొక్కచెరలాట నవధరింపు.15
లయాగ్రాహి. అంగజమదావహశిరోంగవనటత్సరిదభంగురతరంగఘనరంగపరిధారా
- సంగతి మహీవలయముం గడఁక మీఱు నొకయంగగొనువేగ మెనయం గలిగి ఠేవన్