ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
కువలయాశ్వచరిత్రము
ద్వితీయాశ్వాసము
క. శ్రీరమణీనందనరే, ఖారాజద్రూప వైరికైరవవల్లీ
- సూరప్రతాప సవరము, నారాయణభూప కీర్తి నవ్యకలాపా!1
గీ. అవధరింపుము జైమిని కలపతంగ, కులపతంగంబు లిట్లని తెలుపఁ దొడఁగె
- నంత నాసర్వసర్వంసహాధినాథ, జంభసంభేది యత్యంతసంభ్రమమున.2
గీ. ఒక్కనాఁ డంతిపురమున మదుట బిగువు, గబ్బిగుబ్బెతగము లూడిగములు సలుప
- రాజవర్య పరా కజారమున దొరలు, గాచినా రని హెగ్గడికత్తె తెలుప.3
సీ. పచ్చకప్పురము సాఁబాలు గూర్చి కురంగమదమున గీఱునామంబు దిద్ది
- యలరుటెత్తులరూపు వెలిసూపు వలిపెంపు జాళువాసరిగరుమాలు చుట్టి
- మొలకవెన్నెలలబారులు దీరు కట్టాణి తెలిపాలకాయయెంటులు ధరించి
- క్రొత్తముత్యపు మేలుకుట్టుఁ జీనాపట్టుఁ దళుకుబంగరుపూలదట్టిఁ బూని
- పికిలిపూబంతి దంతపుఁబిడి కడాని, పోఁతయొఱ వంక మొలవంకి పొంకపఱచి
- తమ్మిదోదుమ్మిజోదుసాదనలహరువు, వ్రాఁతపనిదుప్పటీవలివాటు వైచి.4
చ. ఉడిగపుటింతి కట్టెదుట నుంచినపావలు రాజసంబునం
- దొడిగి మెఱుంగుటుంగరపుఁ దోరపుహీరపుమించుమంచుపైఁ
- బడఁ దులకించు కల్వవిరిబుతులమించు మదాళిమాళిక
- ల్బడి నిరువంక వైచు తెలిపావడదోపుల వీఁగిపోవఁగన్.5
చ. చెలువలు వీచు పూసురటిఁ జిందినతెమ్మెరల న్రుమాలు చుం
- గులు గదలంగ వాఁడికొనగోరులసోఁకుల గబ్బిగుబ్బచా
- యల గరుదాల్చు నిద్దఱు లతాంగులు మూఁపులఁ జేతులూఁదిరాఁ
- జిలుకపటానితేరిదొర చెన్నున నంతిపురంబు వెల్వడెన్.6
క. సకియలు సాహోయనఁగా, నకలంకశశాంకమణిగణాంతఃప్రతిబిం
- బకలాకలనాద్విగుణిత, సకలానుగవారమౌ హజారముఁ జేరెన్.7
గీ. చేరి జగజోతిమగరాతి చెక్కడంపుఁ , గలికినీలంపుమెట్ల సింగంపుగద్దె
- నుడుతకాల్పట్టుజిగి యడ్డయొఱగుతోడి, సొగసు నిద్దంపుఁ బట్టుగద్దిగ వసించి.8
సీ. చెవిదండఁ జేరి నిల్చిన వ్రాయసమువారి ముదలకమ్మల కొప్పములు లిఖించి