ఈ పుట అచ్చుదిద్దబడ్డది
16
కువలయాశ్వచరిత్రము
ఆశ్వాసాంతము
మ. మృదువాణీసుమచాప చాపలపలాయిద్వేషిరాజన్యకా
- న్వదితాశాంచలభాగ భాగవతసంపన్నిత్యపూజాలస
- త్సవనాధిష్ఠితవిత్త విత్తమనుతస్వచ్ఛస్వకీర్తిచ్ఛవి
- చ్ఛిరురేందుద్యుతికాండఖండదతి నాసీరైకభేరీరవా.106
క. గాంధర్వరసిక యౌవన, గంధర్వవిపత్సఖర్వగర్వవిదళనా
- సంధానధురంధర బల, సంధానవపరశురామ సంగరభీమా.107
మత్తకోకిల. నందనందన పాదనత్యభినందిమానససింధుగో
- విందసన్మణినాగపట్టన విశ్రుతప్రభుతోజ్జ్వలా
- చందనైందవసుందరీహరిచందనద్రునవప్రతి
- చ్ఛందనూతనకీర్తికందలచంద్రికాంకదిగంకణా.
గద్య
ఇది శ్రీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమ
- న్వయాభరణ నారాయణభూపాలతనూభవ శఠగోపతాపసేంద్రచరణారవింద
- సంచలన్మానసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర
- రూపరేఖావిజితచైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధా
- యక చిననారాయణనాయకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రం బనుమహాప్ర
- బంధంబునం బ్రథమాశ్వాసము.