ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
15
- నక్కడక్కడి కరుగ నుపాయ మెంచఁ, గాసె బీఱెండ మార్తాండకరగృహీత
- సలిలసింధువినిర్గతజంతుకబల, నాగ్రహవ్యగ్రబాడబాత్యుగ్ర మగుచు.96
చ. మిటిమిటియెండవేఁడిబలిమిం దెలిదమ్ముల ఱేకుసందులం
- జిటుకుమనంగ నోడి నివసించి తదగ్రమరంద మప్పట
- ప్పటికిని మూతిముటైపైఁ బైఁబడి చల్లఁబడంగఁ బ్రొద్దుకుం
- కుటఁ గని యంతట న్వెడలుఁ గోడెమిటారపుఁతేఁటు లత్తఱిన్.97
సీ. కావళ్ళు గలిగెఁ జొక్కపుఁ గప్పురపుఁ బల్కు లడరించు నేడాకుటనఁటులకును
- సుంకంబు లుడిగె మెచ్చులు రా గుబాళించు చేవయెక్కు మలాక చెక్కలకును
- హెచ్చుకట్టడి గల్గె నింపుగారవమాడ వళ మద్దుచాయలవారలకును
- మన్నన ల్గలిగె మేల్పన్నీరుచెంబు లేర్పఱచి తెచ్చినయపరాధులకును
- హుజురుకొలువులు గలిగె సొంపొలుకు తేట, నీటికొలఁకులలో బెండు నిండువగల
- దెప్పపై బొండుమల్లెల చప్పరములు, నెరయఁజేసినవారికి దొరలచేత.98
మ. కొలఁకుందామరతావితెమ్మెరలసోఁకు ల్దెచ్చు ముత్యాలత
- ల్పులబల్సోరణగండ్లచాయఁ గపురంపుంగుంపుసొంపూను మే
- ల్మలకాగందపుతేటతోడి జిలుగుంబన్నీటిధూమ్రంపుఁది
- త్తులచేఁ బొద్దులు వుత్తు రత్తఱినిఁ గాంతు ల్కాంతలు న్మేడలన్.99
చ. అలసిన మమ్ము మింటి కెగయం ఘటియించి భరంబువాపు వా
- త్యలఁ గనుఁగొన్నఁ గాని తనకబ్బకు హర్షమటంచు శేషుఁ డ
- ర్మిలిఁ దల లెత్తిచూచు బిలరేఖలన న్మడుగు ల్చెలంగె ని
- ర్జలలసితాబ్దకోరకపరంపర తత్ఫణమండలంబుగన్.100
క. పరుసైన యెండమెండున, నరవరలై హాయిలేక యలజడి పడఁగా
- సురగాలి యేఁచెఁ బ్రజలం, గఱవుకుఁ దోడావపంట గలిగిన కరణిన్.101
క. అడరెడు నదీజలంబుల, నెడవాయఁగలేక యవి మహిం గ్రుంకినచో
- నడుగంటి నిలిచి తెలిపిన, సుడు లనఁగాఁ జెలమలింపుఁ జూపెం బ్రజకున్.102
గీ. కూపములమీఁదఁ గలలోభగుణముకతనఁ, దూఁచి కైకొనుకైవడిఁ దోఁచె నపుడు
- హలికజనములు పరికల్పితాంబుయంత్ర, ముల జలంబుల గ్రహియించు చెలువు మెఱయ103
క. జడజవనబంధువేఁడిమి, నుడికెడు పుడమికి నొకింత యూరట సేయ
- న్నడుమ నెలకొన్న వెన్నెల, నడువున శాల్మలుల తూలవారము నెఱసెన్.104
గీ. అట్టి గ్రీష్మర్తునందు నయ్యధిపమౌళి, యతులతరభోగభాగ్యంబు లనుభవించె
- ననిన జైమినిముని యావిహంగము లన, నంతరకథావిధం బెట్టిదని యడిగిన.105