ఈ పుట అచ్చుదిద్దబడ్డది
14
కువలయాశ్వచరిత్రము
- వారిదాస్త్రము వైరివీరులఁ జాలించుఁ గర్మందులై గాలిఁ గమిచి మ్రింగ
- నంధకారాంబకం బరుల కప్పన యిచ్చు నిహతులై కమలినీనేతఁ బొదువ
- నహిశరం బహితరాజాళి కానతియిచ్చు శబరులై కీకససమితిఁ బొదువ
- నౌర యీరాజవరుఁ జేరి యసమజన్య, మందు నివియెల్ల స్వామికార్యస్వకార్య
- ములను వంచన లేక వర్తిలఁ దొడంగె, గాఢమతిశాలిమంత్రిపుంగవు లనంగ.91
శా. ఆలీలాజలజాస్యుఁ డశ్వతరుఁడన్ వ్వ్యాళేంద్రుపుత్రు ల్నయ
- శ్రీలాసిస్వచరిత్రు లిద్దఱు నిజస్నేహాతి రేఖాజహ
- త్కేళీలోలతఁ దన్నుఁ గొల్వ మది నుద్దీపించు ప్రేమంబునం
- గాలక్షేప మొనర్చు దుష్టజనశిక్షాశిష్టరక్షాదృతిన్.92
సీ. ఒకవేళ దండనాయకులు పౌజులు దీఱి పొడఁగానఁగా స్వారిపోయి మరలు
- నొకవేళ వెనువెంట నూడిగా ల్గొనుచు ఘోట్టాణంబు నెక్కి జోడనలు చూపు
- నొకవేళ మంత్రిగాయకముఖు ల్గొలువఁగా సుముఖుఁడై నిండోలగమున నుండు
- నొకవేళ మాఱువాలకముతో నసిసహాయంబుగాఁ బురశోధనం బొనర్చు
- నొక్కవేళను భరతశాస్త్రోక్తరీతి, జాణలునటించు నాటకశాలఁ జూచు
- నిట్లు వారాశివేలాపరీతభూమి, పాలనశ్రీల నారాజు బరఁగునంత.93
మ. బిలనిశ్చేష్టజరద్భుజంగము తదాభీలాతిఫూత్కారగా
- రళఘోరానలభావదాయకదనవ్రాతంబుఁ డచ్చాంతివీ
- క్ష్యలలచ్చైవలినీభవిష్ణుమృగతుృష్ణాలీలమై యుర్వరం
- గలయం బర్వె నిదాఘకాలము సమగ్రక్లాంతదిగ్జాలమై.94
సీ. జలవిహంగములు శుష్యజ్జలాశయముల కితరపక్షులఁ జేరనీక తఱిమె
- వనకరుల్దవవహ్ని యనుజుంజములు సోఁకఁ గరము లెత్తుచుఁ గొంచపరువు వాఱెఁ
- జిలువచాల్కలుగులోపల స్రుక్కి యన్యోన్యఫూత్కారపవనాప్తిఁ బొట్ట నించెఁ
- బులు లాఁకట నలంగి బొరియలడాఁచిన పలలంబులకుఁ బోను బాలుమాలెఁ
- దమకుఁ బాన్పైనతరణికాంతములు పొదల, యాకుసందులఁ బొడయెండలంటి ప్రక్క
- చుఱుచుఱుకుమన్న మెకములు గెరలి బెదరి, గొరిజదాఁటుగఁ బరుగెత్తి తిరిగిచూచె.95
సీ. యతిజను ల్చక్రవాళాద్రియవ్వలిమునీంద్రులతోడ మాలిమి గలదటంచు
- ఫణివరు ల్పాతాళపతియైన యౌరగేశ్వరుఁడు మా కేలినవాఁ డటంచు
- నచులు పంకజభవాండము చుట్టికొన్నట్టి యుదధిరా జున్నాఁడు గద యటంచు
- నంచలు సత్యలోకాధీశుఁడగువాని సొగసుతత్తడి మాకుఁ జుట్ట మనుచు