ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
13
చ. అనిలునిఁ జేసె లేడి భువనాంచితపావనమూర్తి వైనతే
- యుని విధమంటిమేనిఁ బురుషోత్తము నెందున నామధేయుఁగా
- నొనరిచె నంచు నచ్చటిహయోత్కరము ల్బహుమండలప్రవ
- ర్తనము జగత్ప్రసిద్ధగుణధారలుఁ జూపు నిజేశ్వరాళికిన్.83
చ. ఊరగకులోద్వహుండు పగ యొప్ప దటంచును దార్క్ష్యసంగతం
- బరఁగఁ దలంచి వజ్రసుషమాతిరమాపరమానుషక్తిచే
- నరదము లయ్యెఁ గావలయు నప్పురరాజమునందుఁ గానిచో
- హరిపదమందు మేల్పడగలందునె చక్రివిధంబుఁ జెందునే.84
చ. చలువలు గట్టి చన్నుల హుసారుగ గంధ మలంది కప్పురం
- బలరెడి ముత్తెపుంబరణు లంది తనర్తుల్ గట్టి వాల్చెలుంరు
- తెలియఁగ నాత్మకాంతిధవళీకృతపద్మభవాండముం గరా
- మలకముఁ జేసి నిల్చు పురమానవకీర్తిలతాంగులో యనన్.85
సీ. ననవింటివాని సానాకత్తి పరుఁజు టెక్కుల చొక్కటపు సాముకొండె లలర
- మురువుదీర్చిన చన్నుమొలక యద్దములకు గవిసెనల్వలెఁ జనుకట్టు లమరఁ
- దీవలపైఁ బూవుఁదేనెసోనలలీల మేనుల సంపెంగనూనె తనర
- బటువు గద్దియలపైఁ బట్టుగద్దిగ రీతి జఘనదేశముల హిజారు లమరఁ
- గడగి మీఁదటికన్నెఱికంబుఁ జెఱప, నొకనికొకఁడు వితాకొలారకము లనుపఁ
- దళుకుఁ గాంతురు వింతసాదనలఁ దీఱి, గుడి వెడలి వచ్చుబోగంపుఁబడుచు లచట.86
క. కాదంబరి స్వాదించియు, మోదంబునఁ గౌముదీసమున్మేషము సం
- పాదించియుఁ దబ్బిబ్బుగ, వాదింతురు రేలు వారవనితలు వీటన్.87
చ. తొలఁకెడుతావిగంపవొడి తూరుపువాఱఁగఁబట్టి మల్లెపూ
- వలపులు కొల్లలాడి హిమవారిఁ గలంచి మెఱుంగుఁబోండ్లగు
- బ్బలపయి చంద్రకావిజిగిపయ్యెదకొంగు లెడల్చి యెందు మై
- దెలియక తూలుకొంచు వలిదెమ్మెరలాహిరికాఁడు త్రిమ్మరున్.88
క. ఆనగరంబు ఋతుధ్వజ, భూనగవరవైరి యేలు భూమహిమధరా
- ధీనధరాహీనధురా, హీనకరారచితకీర్తి మృదుకంచుకుఁడై.89
క. చకచకితనఖరముకుర, ప్రకరముఖచ్ఛాయఁ దొంటిభంగి గనుటనో
- వికటమహిపాళి తత్పద, నికటంబున వ్రాలి లేవనేరకయుండున్.90
సీ. అనిలబాణము శత్రుజనులకు సెలవిచ్చు జోగులై భోగులై స్రుక్కఁజేయ