ఈ పుట అచ్చుదిద్దబడ్డది
12
కువలయాశ్వచరిత్రము
- నరిగి తదీయభూతిఁ గొనియాడు నిజాప్తులు మూఁగి యూకొనన్.76
మ. తళుకు న్మేడలమీఁది చేడియల చేఁత ల్తేటమిన్నేటిలోఁ
- గలయం గానఁబడం దదంబువిహరర్గంధర్వు లీక్షింపఁ ద
- ల్లలన ల్గన్గొని యద్దపున్ముడుపు లేలా చూడఁగా నంచు వా
- రలచూపు ల్మరలింతు రల్లన మిటారంపున్నునుంబల్కులన్.77
సీ. కార్యత్వరాగతాగతసౌరకులవారకాంతలు చేదివ్వె సంతరింపఁ
- బూర్వాభిసారసంభోగానురాగతారావధూమణి చంద్రురాకఁ గోరఁ
- గేలిలాలసమరుద్బాలికాపాలిక ల్కడఁగి చీఁకటి మొట్టికాయ లాడ
- మఘవదాజ్ఞాలంఘనఘనజాంఘికభటోత్కరములు కాణాచిగా రమింపఁ
- దనరు వనరుహనాభనూతనరుచిప్ర, చండపురనీలజాలకసౌధయూధ
- కాంతిసంతానమంతరధ్వాంతరోహ, వీథిసురపట్టనాధ్వాంతరోధి యగుచు.78
శా. ఈనీలపుమేడల న్శుభవిధాయి స్వర్ణపాంచాలికా
- కేశు ల్మేలగు పాండురాజభవభక్తి న్మించియు న్సౌరభా
- వాలోద్వేలశిలీముఖప్రభల భాస్వన్నందనాలింగనే
- చ్ఛాలబ్ధిం దగి యక్షయాంశుకతతి న్సంధించుచుం దత్పురిన్.79
గీ. రవిరథతురంగములు నిబ్బరముగ వచ్చి, హర్మ్యముల నిల్చి వేసవి నచటిముద్దు
- గుమ్మ లచ్చపుఁ జిమ్మనగ్రోవినీట, నురుఁగుఁ గడుగఁ బథిశ్రాంతి దొఱఁగి యరుగు.80
సీ. సకలాగమస్ఫూర్తిఁ జరియించుభూసురు ల్పనసలు కొన్ని యేర్పఱచు టరుదె
- యనుపమధైర్యశౌర్యారూఢి గలనృపుల్ ఘనచక్రవైభవం బెనయు టరుదె
- రాజరాజప్రౌఢి రహిగల్గు కోమటు ల్వరవైభవంబున వరలు టరుదె
- కువలయప్రఖ్యాతిఁ గొమరొందు శూద్రులు ద్విజరాజభక్తి భావించు టరుదె
- యనఁగ సుమనఃప్రవృత్తిచే నతిశయిల్లి, యచ్యుతస్థితిఁ జెంది కర్ణాతిసహ్య
- సరణి గణనకు నెక్కుచు సరసులందు, వెలసి సన్నుతిగాంతు రవ్వీటియందు.81
సీ. పట్టపుటేనుంగు పజ్జలబిరుదడక్కారావ మాలించి యట్టె తూఱు
- దాని నవ్వలఁ దీయఁ దళకుగోడల మచ్చుఁ దమనీడఁ జూచి యుద్ధతిని గ్రుమ్ము
- నాచెంత గరిడీలనమరు సాదనమ్రోఁత విని యచ్చటికి గిరుక్కునను మరలు
- నది చూచి యదలించు నాదికట్టికవారిఁ బైనెత్తు బంధము ల్తోనె తునియ
- రెక్కలన గంటలమర సారించి చాఁచుఁ, గరము పిలిచినవారలఁ గదియ నిగుడ
- దరలు నని మావటీండ్రు కొందలపడంగఁ, గదలు వీథులఁ దత్సురీగంధకరులు.82