ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
11
సీ. ప్రాకారశశికాంతపఙ్క్తికాంతులు చుట్టు నూలిపోగులచాలు లీలఁ గాంచ
- విడికెంపుగుంపుఁ జెక్కడపుఁ జొక్కపుఁ గోటకొమ్మలు జోతులయెమ్మెఁ దాల్ప
- నవరత్నమయనూత్నవివిధవీథీరాజి యమరికప్రోలుసోయగము చెందఁ
- బైఁడికుండల నేరుపడినముత్తెపుమేడ లై రేనికడవలయంద మొంద
- జయరమాసతి తత్పురీశ్వరవివాహ, గరిమ నాలవనాఁడు నాకబలి చల్లఁ
- దమమహిమ మింటినంటు భక్తంబు లనఁగ, సొగసుఁ గనఁజాలుఁ గడురేలుచుక్కచాలు.70
చ. దళములచాలు మిద్దియలతండముమేలు విచిత్రపత్రము
- ల్చెలఁగెడితీఱు నీరములు చెందినసౌరును గాక రాజురా
- కల విలసిల్లునంచుఁ బురకంజముఁ జేరె రమావధూటి త
- జ్జలజగృహంబులం దలిమిషంబున లక్కను ముద్రవెట్టుచున్.71
ఉ. కోటకు నస్థిభార మొనగూర్చుతఱిం బలియిచ్చు సేమపుం
- జీటులు కొమ్మ దీర్చునెడ శిల్పకు లంతికవర్తి సత్యలో
- కాటనతత్పితామహుని హస్త ముఁ జేర్పుదు రాతఁ డాత్మ నై
- శాటవిరోధిఁ గన్నఁ గొదవంచుఁ గటారి యొఱం దగుల్పఁగన్.72
చ. కలిగిన నేమి జాణలు జగంబున నంబుధినాథువంటిజా
- ణలు గలరే యదెట్టులనినం దనలో మణులెల్లఁ బౌరరా
- జులు జవరాండ్రకుం జికిలిసొమ్ములు సేయ నగడ్తపేర వా
- రలజలఖేలనత్రుటితరత్నములం గిలుబాడు నిచ్చలున్.73
ఉ. అంబుధి మేదినీవసనమై కనుపట్టుటఁ గట్టిపెట్టి ని
- క్కంబుగఁ గోటచుట్టుఁ బరిఘాకృతి నుండుట యేమి యంచు నెం
- చం బని లేదు మందరరసాధ్రసమాంబువిహారితత్పురీ
- శంబరలోచనాజనకుచక్షతి సారదిదృక్షువై సుమీ.74
చ. అగణితకేళిఁ బ్రోలిజవరాలిగము ల్వనపాళి నాడఁగా
- నగడితఁ దేలి యోలినురగాళికచాళి తదీయవేణి సో
- యగములు బాళి మృచ్చిలి వయాళిగ నెమ్మిగయాళి జాడమై
- డిగుననుజాలిఁ గ్రమ్మఱి నడిం జను గూఢపదత్వసంపదన్.75
చ. పురిఁ బరిఘోరీనికరము ల్జలసూత్రమువెంట సౌధమం
- దిరములఁ జొచ్చి యందుఁ దరుణీతనుగంధము కాలిసంకెలై
- నెరయఁగ నిల్చి కేకిరమణీనిహృతు ల్మెడవట్టిద్రొబ్బగా