ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
9
- సగరవృత్తి నెసంగుజహ్నుమౌనితనూజ యమృతప్రవాహవిఖ్యాతిఁ గనియె
- నరవదిగ్బహులాస్య మరయని కావేరి రంగస్థలాభివర్తనముఁ గనియె
- గడునుగ్రగతి యెఱుంగని నర్మదానది సోమోద్భవాదివిశ్రుతులుఁ గనియె
- నేకుమారుని పట్టాభిషేకసమయ, మందు నిజవారి యొసఁగు భాగ్యమున నట్టి
- వీరవేంకటరాయభూవిభునికరుణ, నెలమిఁ బాలించె నిల నారణేశ్వరుండు.52
సీ. అఖిలంబునకుఁ బ్రపంచాంగంబుఁ దెలిపి సత్రములపా లగుపోత్రిరాజుఁ దెగడి
- కలభారతస్ఫూర్తిఁ దెలియంగఁ జేసి దానములు చేకొను నాగసమితిఁ దెగడి
- పండ్లు గన్పట్టంగఁ బనసఁ జూపుచు ముష్టిఁ గైకొను కులధరాగ్రణులఁ దెగడి
- కౌముదీరుచిఁ దెల్పి కడునాదిభిక్షుకాభరణాఖ్యఁ గనుఫణిప్రభునిఁ దెగడి
- వచ్చి చేరిన ధారుణీవనజముఖికి, నీరదులపేరి వెలిజరీచీర లిచ్చి
- నెనరుతో గంధ మొసఁగి మన్నించునాతఁ, డధిపమాత్రుఁడె నారాయణాధినేత.53
గీ. అట్లు పెదరంగమాంబామృగాయతాక్షి, తనయుఁ డైనట్టి రఘునాథధరణివిభుఁడు
- తరణినిభుఁడు ప్రతాపసంతతులవలన, నంచు బుధలోకమెల్ల వర్ణించ మించు.54
గీ. అల్ల శ్రీరంగరాయ ధరాధినేత, దేవతాభక్తి నికురుంబఁ దిమ్మమాంబ
- వరసరోవర కాదంబఁ దిరుమలాంబఁ, దనకు దేవేరులై ముదం బెనయ వెలసె.55
మ. అతఁ డాతిమ్మమయందు వేంకటనృపాధ్యక్షున్ రిపుక్షేషణో
- ద్ధతు రంగాధిపుఁ దిర్మలాంబవలనన్ ధర్మాత్ము గోపాలు స
- న్నుతకీర్తిం జిననారనాఖ్యుఁడగు నన్నుం గస్తురీంద్రు న్సమం
- చితకీర్తి న్రఘునాథుఁ దిమ్మవిభుఁ గాంచె న్సజ్జనాధారులన్.56
గీ. అతని యనుజన్ముఁ డైనకృష్ణావనీంద్రుఁ, డెలమి రుక్మాంబవలన నహీనగుణుల
- రంగనృపు సాంద్రతరదయారామచంద్రు, వేంకటపతీంద్రు వేంగళవిభునిఁ గనియె.57
మ. అలతిమ్మాధిపు నారనేంద్రుఁడు దయాధారుండు నన్నుం జయో
- జ్వలుఁ గృష్ణాధిపుపుత్రు వేంకటపతిక్ష్మాకాంతచంద్రున్ గుమా
- రులుగాఁ గైకొని ప్రోచెఁ గాన నతఁడే రూపింపఁగాఁ దల్లిదం
- డ్రులు దైవంబును నయ్యె నిద్దఱకు నెంచు న్సందియం బేటికిన్.58
సీ. చలపట్టెనా వైరిజనపాలకుల ఱెక్కముక్కాడనీయక యుక్కడంచుఁ
- బూనెనా యరిధరాభుజుల నంతఃకలహంబు గల్పించి పాయంగఁ జేయు
- నెంచెనా పరిపంథిపృథివీపతుల దాడి వెడలించి తన వెంట వెంటఁ ద్రిప్పుఁ
- దలఁచెనా రిపురాజిఁ దనహజారంబునఁ బడిగాపులై తడఁబడఁగఁ జేయు
.