ఈ పుట అచ్చుదిద్దబడ్డది
8
కువలయాశ్వచరిత్రము
వ. అమంధరవీర్యుండగు తిమ్మనృపకంఠీరవుండు తిరుమలాంబయందు గంభీరభేరీమహా
- రావనిర్దలితకకుప్పటలవిశాలుం డగు తిప్పనృపాలుని రణరంగసంగతజయరమాధు
- ర్యుం డగురంగరాయనృపవర్యుని నుష్ణకరతేజుం డగుకృష్ణధరాబిడౌజునిం గనియె
- మూర్తిమాంబయందుఁ గర్ణాటకాధీశ్వరదయాసాంధ్రుం డగు నారాయణవసుంధ
- రాదేవేంద్రునిం బెదరంగమాంబయందు నమందవితరణశాలియగు రఘునాథనరనా
- థమౌళిని లక్ష్మాంబయందు నౌదార్యనిస్తద్రుండగు రామప్రభుచంద్రుని గొండమాం
- బయందు ధర్మచర్యాదిలీపుండగు గోవిందభూపుని గురవమాంబ యందు శౌర్యహర్య
- క్షుండగు తిమ్మధరాధ్యక్షునిం గాంచె వారలలోఁ దిప్పనృపాలు శౌర్యం బెట్టి దనిన.45
సీ. తనయిల్లు విడిదసేయనటంచుఁ జలపట్టు కొడుకు చేతులు పట్టుకొనఁగవలసె
- తనరంభ వారి కీయనటంచు వాదించు కౌబేరికుఁడు గర గప్పవలసె
- నులుపకై యీగిమ్రాకులచెంతకును దానె చని యిప్పు డాదుకొం డనఁగవలసె
- దెల్లయేనిక నన్నుఁ దెమ్మందురో వార లని మూలదెస దాఁచుకొనఁగవలసె
- నౌర తిప్పనృపాల బాహాసిధార, నవని విడనాడి ఱొమ్ముగాయముల వచ్చు
- కడిది పగఱకు నుచితము ల్నడపుహరికిఁ, జాలుననిపించె నమరరాజత్వగరిమ.46
క. అలతిప్పధరాపాలున, కలఘుకృపాళునకు ననుజుఁ డై కాహళికా
- కలితధ్వనిహలహలికా, చలదరి శ్రీరంగరాయజనపతి వెలయున్.47
క. మానకథానిధి యాధర, ణీనాయకమౌళి యరుల నిద్దురవుచ్చున్
- మానక మృడకరడమరుస, మానకభటపటలపటపటార్భటిపటిమన్.48
సీ. తనకుఁ గూఁతు నొసంగి తనరిన దక్షుఁ డిష్టార్ధభంగముఁ జెందియవలఁ దిరుగఁ
- దనకు ననంతపద్యారూఢి యొసఁగిన చతురాస్యుఁ డెపుడు విచార మందఁ
- దనపైఁ బదం బమర్చిన పురుషోత్తముం డెందు నిరాకృతిఁ జెంది నిలువఁ
- దనకు సత్కృతిపతిత్వం బిడిన బుధేంద్రుఁ డాశానువృత్తి నిత్యంబు మెలఁగ
- వెలయు టిది యెల్ల యేదానవిధమటంచుఁ , జంద్రనీరదశిబికర్ణసరణిఁ గేరి
- సుకవివర్యుల కఖిలార్థనికర మిచ్చుఁ, బ్రకటగుణుఁ డైన శ్రీరంగరాయనృపతి.49
క. ఆతని తమ్ముఁడు కృష్ణధ, రాతలనాయకుఁడు వెలయురంభావైరి
- వ్రాతమకరాంకకేళీ, దూతీకృతహేతి లలితదోరర్గళుఁ డై.50
క. మూర్తిమాంబాతనూజు సత్కీర్తి నీయ, భవ్యరవితేజు నిబిడవైభవబిడౌజు
- నతులరేఖాతిచంద్రు నారాయణేంద్రు, బ్రకటగుణసాంద్రు సన్నుతింపఁగఁ దరంబె.51
సీ. బహువర్షములుగన్న పాథోనిధిస్వామి నవ్యలావణ్యవర్ణనముఁ గనియె