ఈ పుట అచ్చుదిద్దబడ్డది
100
కువలయాశ్వచరిత్రము
- లతలనం బ్రతిఫలించి గజాంబుధిరాజపుత్రికారాత్రికంబు సవరింపం బరంపరలై బా
- రు దీరు ప్రతాపాంకురంబులనం బరఁగుఁ బురుసలతోఁ గురుంజులపైఁ దిరుగు నురగ
- కరిగమనల వలయాకారపరిభ్రమచ్చిరోమణీనికాయంబులకు సంగడీలై తురంగ
- లింప రంగదుత్తుంగభర్మ్యహర్మ్యాంగనావికీర్ణలాజాసమాజంబులు భానుకల్పితం
- బులగు ముత్తెంపుఁ దలఁబ్రాలునకు స్మారకంబులై రకంబుఁ జూప వింతకోపుల
- నాఁడు వెలచేడియల మైసిరియెడం దళుకుతళుక్కుమనం బిక్కటిల్లిన వెన్నెలల
- క్షీణమణిగవాక్షంబులవలనం జూచు నవరోధగిరి పయోధరల మొగంబుల ముద్దు
- బట్టబయలు చేయ సర్వసన్నాహంబు మెఱసి యరుగుదెంచిన కువలయాశ్వు నశ్వత
- రోరగేశ్వరుం డెదుర్కొని నీరాజనాద్యుపచారంబులు నడిపించి తోడ్కొని చని
- వివాహవేదికాంతరంబున సుఖసమాసీనుం జేసిన యనంతరమున.94
చ. వరుస మెఱుంగు బాసికపు వజ్రపుఁ గుచ్చుల గచ్చుపైఁ బరా
- బరి యొనరించు ముత్తియపు బావిలినిగ్గు పరాకుఁ దెల్ప ని
- బ్బరమగుఁ గొంకుఁజూపు దొరపాదనఖద్యుతిమీఁది నేర మే
- యరయ వివాహవేదికడ కల్ల మదాలస వచ్చినిల్చినన్.95
సీ. తరుణులు వెలిపట్టు తెరవట్టఁగా నశ్వతరుఁడు దేవిపసిండి తళుకుగిండిఁ
- బన్నీరు వంప భూపాలు పాదాబ్జముల్ కడిఁగి కన్నియమాట కరణిఁ దనరు
- ...........................మొసగి క్రొంజిగికట్టు, ప్రాలపుట్టికలపైఁ బతియు సతియు
- నిలిచిన ముద్దుగుమ్మల సోబనపుఁబాట నిజపురోహితవేదనినద మఖిల
- వాద్యఘోషంబు ఘనవైభవంబు మెఱయ, దారవోసెను పదపడి వారుకొంకు
- సిగ్గు తమకంబుఁ జిఱునవ్వుఁ దొంగలింప, నొండొరులమాట వీక్షింప నుచితరీతి.96
మ. కులుకున్ సందిటఁ జెందు మైలతిక కొంగల్ రంగులీనంగఁ గ
- మ్మలడాల్ చెక్కిటఁ బల్లటీలు గొనఁ గొమ్మల్ చేరి పోయించఁగా
- బలుఠీవుల్ పచరించు చూపుజిగితో వాదించు ముత్తెంబులం
- దలఁబ్రా ల్వోసె వధూటి భూధవసుధాధామోత్తమాంగంబునన్.97
క. అంగాంగసంగతిని దన, ముంగై చెమరింపఁ గంఠమున సతికిన్ రా
- జాంగజుఁడు కట్టె మణిమయ, మంగళసూత్రంబు జాయమామోత్సుకుఁడై.98
క. తాలిమిఁ బురోహితుఁడు మం, త్రాళుల్ చదువంగ నిర్భరానందమునం
- గీలిఁ దగ దంపతుల్ మఱి, వేలిమి గావించి రుచితవిధమున నంతన్.99
గీ. మంత్రము లెసంగ సన్నికల్ మట్టఁజేసి, రప్పుడు పురోహితచయంబు లంత నురగ