ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పంచమాశ్వాసము
99
- మ్మను విరిపువ్వుటెత్తుల నొయారముగా సడలించునంతటన్.87
మ. తళుకుం బాపటబొట్టు చందమున నృత్యంబాడు నాసామణిం
- బలె నర్తించు సరంబురీతి నటనప్రావీణ్యముం జూపు గు
- బ్బల హసద్వయకంకణధ్వనుల సేబాసంచు మెచ్చం దమిం
- దలయంటెం దరళాక్షి యొక్కతె ధరానాథాన్వయస్వామికిన్.88
క. ముందుగ నిగ్గులనీలము, లొందింపక చిక్కువడక యుండ న్నెఱులన్
- గందపుటటక లిడియెనొక, యందపునెఱవన్నెలాఁడి యన్నరపతికిన్.89
మ. జలముల్ తెచ్చిన పైఁడిబిందియల మెచ్చంబోని ఘర్మాంబుకం
- దళపుం జన్నులమిన్న లీయ లత లానందమ్మునం దేనెసో
- నలు వంచన్ నలువొందు తుమ్మెదలనన్ రాజిల్లఁగాఁ బెన్నెఱుల్
- జలకం బార్చిరి కొందఱింగుముఖు లాసర్వంసహానేతకున్.90
చ. చలువ లొసంగి వేడుక పొసంగ మెఱుంగుపరంగిపీఁట న
- న్నెలఁతలు రాచఱేమగని నిల్పి కురుల్ తడియార్చి గోరులం
- గలయఁగ దువ్వుచున్ హొయలుగా సిగ వైచి మెఱుంగుముత్యమున్
- గులికెడు బాసికంబు దగఁగుట్టి రుమాలువు గట్టి రంతటన్.91
గీ. కలికి యొక్కతె పెద్దచౌకట్లు పెట్టె, ముదిత యొక్కతె నీలంపుమురువు నిలిపె
- రమణి యొక్కతె పచ్చతురా యమర్చెఁ, గాంత యొక్కతె తెలిపతకంబు లిడియె.92
క. ఈరీతిఁ జెలులు నృపు సిం, గారించి యనంతభుజగకాంతుపనుపునం
- దార మొదలైనవా రొ, య్యారిం గైసేయ నిర్భరానందమునన్.93
వ. భుజంగపుంగవుం డభంగురత్వరాయత్తచిత్తంబుతో బడిబడిం బనుపఁ బుడిబుడిం
- జనుదెంచి యమాత్యులు ముహూర్తం బాసన్నం బయ్యెనంచుఁ విన్నవించినం బ్ర
- సన్నవదనంబుతోఁ జిన్నివెన్నెలతో సరిమన్నెఱికం బుప్పళించు కప్పురంబులతోడి
- విడియంబు లొసఁగి గద్దియ డిగ్గి ముద్దియలొసంగు కైదండఁ గొని విడిది వెలువడి
- యుద్దండగండమదధారావిభ్రమద్భ్రమరీమండలంబగు వేదండంబు నెక్కి వామ
- హస్తంబునం బ్రశస్తమణిగణోత్కీర్ణంబగు నంకుశంబునం గుంభంబు లూఁది వెనుకం
- దగునూడిగంపుఁ జేడియ లందియిచ్చు పావడకుం దెలనాకుమడుపులకుం జాచు ద
- క్షిణకరంబునం బొసంగు నుంగరంబులం జైలంగు మగఱాల డాలు పరిచారకులపై
- వెలిపావడలతో వీడుజోడాడ నిజ ప్రకల్పితతరంగతురంగమోన్నిద్రుం డగుటకు
- మెచ్చి తరణి యనిపిన కిరణసహస్రంబులనం బెంపుఁగను కరదీపనికాయంబులు త