ఈ పుట అచ్చుదిద్దబడ్డది
98
కువలయాశ్వచరిత్రము
- యాసముతో వశీకృతికినై రజమెత్తఁగఁ బూజవెంబడిం
- జేసిన రీతి మించి యతిచిత్రజవంబున వచ్చి మచ్చికన్.77
క. అక్క ఋతధ్వజుఁ డఁట యతఁ, డిక్కడి కేతెంచెనఁట ఫణీశ్వరుఁ డతనిం
- గ్రక్కున నెదుర్కొనంజనె, ఢక్కాపటుపటహతమ్మటధ్వను లొలయన్.78
క. నగరికిఁ జని కేంపులపని సొగసులుగల మేడ యెక్కి చూతమె యనినన్
- మగువ సిగమిన్న యరిగెన్, మొగమలరం జేటికాసమూహము గొలువన్.79
ఉ. అంత భుజంగపుంగవుఁ డుదారతురంగశతాంగకోటితో
- దంతిఘటాఘటాగ్రబహుథావిగళన్మదధార మార్గసీ
- మాంతరమందు జల్లు కలయంపులకుం బునరుక్తి నింప న
- త్యంతముదంతరంగుల నిజాత్మజులం గనుఁగొంచు వచ్చినన్.80
గీ. అచట మున్నె తరుచ్ఛాయ నాశ్రయించి
- యున్న యానరలోకమాన్యుండు నప్పు
- డెదురుగాఁ జని తోడ్కొని యేఁగి యచట
- నుచితకృత్యంబు నడుప నయ్యురగవిభుఁడు.81
గీ. లేచి నిలుచున్న మంత్రులఁ జూచి రాజు, గారి గుణకథనంబు లవ్వారిగాఁగఁ
- దెలుప విన్నందులకు మేము పిలువనంపి, నపుడె వచ్చినయందుల కనుగుణంబు.82
క. అని సన్నుతించి విడిదికిఁ జనుఁదెండని కుంభినీంద్రజంభారిం దో
- డ్కొని చని యట నులుపా నిం, డిన యొకగేహమున విడిది నియమించె వెసన్.83
చ. అతనికి నమ్మదాలస యుదారకథాభ్యుదయంబుఁ దెల్పి యో
- క్షితివర పెండ్లి యిచ్చటనె చేయుతలంపున నిన్నుఁ బిల్వఁబం
- చితినని సంబరం బొదవఁజేసి ఫణీంద్రుఁడు పట్టనం బలం
- కృతముగఁ జేయఁబంచె బహురీతి ముహూర్తము నిశ్చయించుచున్.84
క. అంతఁ గుండలఁ దోడ్కొని యరుగుడెంచి, తార యంతయు విని మోదవారిరాశి
- మగ్నమై తద్వివాహసంభ్రమముఁ జూచు, తలఁపు బొడమిన నచ్చోట నిలిచె నంత.85
క . ఎలమి నల చిలువరాఱే, చెలిచెల్వుఁడు పెండ్లికొడుకు సింగారింపన్
- జెలులను బనిచిన ననిచిన, తలఁపుల వారరిగి వస్తుతతు లింపొసఁగన్.86
చ. పనిహరువుం బెనఁగొనిన బంగరునిద్దఁపుఁ బెండ్లిపీఁటపై
- జనపతి నుంచి యొక్కయెలజవ్వని మేల్ బురుసా రుమాలు గుం
- దనపుమెఱుంగుపైఁ గవఁగఁ దాయతుచేరుల నిండఁ దావి ఘ