ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పంచమాశ్వాసము
97
- గడగడమను మేను గలిగెఁ దోడుగనంచు నసియాడు కౌను సంతసము జెంద
- వీడుపయ్యెద వసివాళ్ళువాఁడుమోము, నడుగు దడఁబాటు నెమ్మేనఁ బొడము చెమట
- మెఱయు రక్కసుచే వీడి మీననయన, యచ్చరలగుంపుఁ జేరంగ ననుసరించె.67
గీ. అంత దేవతలెల్ల, జయంతధనద, పుత్రకుల నొక్కటిగఁ జేసి పొంకపఱచి
- నెలవులకు నేగఁ జాలు నానింద తప్పె, ననుచు నేదానిఁ దోడ్కొని యఱుగుదెంచి.68
క. నాయింట నునిచి మఱి య, త్తోయజముఖి తనకు నాఁడుఁ దోడుగఁ జెలిమిం
- జేయుచునుండఁగ నొకనాఁ, డాయమ ననుఁ జూచి వికసితానన యగుచున్.69
సీ. వినవమ్మ కుండల యనుదాన నలవిభావసుకుమారిక మదాలసయు నేను
- గ్రీడింపఁ బాతాళకేతుండు గొనిపోయి మందరభూధరం బందు నిల్ప
- నచటికిఁ గువలయాశ్వాధీశుఁ డేతెంచి దనుజేంద్రు ఘోరయుద్ధమున ద్రుంచి
- మముఁ దోడికొనిపోవ మఱి వానియనుజుండు తాళకేతుఁడు మహోత్తాలలీల
- మాయచే మమ్ము దోకొనిపోయి మేరు, మందిరములందు నునుప నమ్మందగమన
- గాన కొకనాఁటిరాత్రి నక్కాంతఁ దలఁచి, తలఁచి పొగులుచునున్న నద్దనుజుఁ డెఱిఁగి.70
గీ వెనుక వచ్చెన నీ వేగు మనుచు దాని, మున్ను గానంపఁబోలు నీవన్నెలాఁడి
- మోసపోయిన నిదియును మొరఁగిపోవు ననుచు నొకయాగ్రహముఁ దెచ్చుకొని యతండు.71
క. వేఱొకతావున నుండం, గోరికి మై నన్ను నెత్తికొని చనుదేఱన్
- మీరల్ చూడఁగ నైనది, మీ ఱెఱుఁగుదు రింక నేల మీదటివార్తల్.72
క. నాకత యిత్తెఱఁ గయ్యెన్, వ్యాకులమున నింత కమ్మదాలస నెటకుం
- దోకొనిపోయెనొ దనుజా, నీకంబులచేత నెంత నెగులొందునొకో.73
చ. తనువులె రెండుగాని వనితా మఱి ప్రాణము లొక్కటమ్మ మా
- కని పలుకంగ సిగ్గు దళుకయ్యెడు నట్టిప్రియాళిఁ బాసి యీ
- యనువునఁ బ్రాణముల్ నిలిపినట్టి కతంబున దానిఁ జూడకుం
- డిన నిమిషంబు తాళఁగలనే! మఱి యెచ్చటికేని నేగెదన్.74
గీ. అనిన నూరార్చి యవ్వార్త నరసివత్తు, నుండుమని దాని నాయింట నునిచి యేను
- బుడమిపై డిగ్గి వచ్చుచో నడుమఁ గంటి, నారదునిచేత నీదు చందంబులెల్ల.75
క. విని యిచ్చటి కరుదెంచితి, మనముచ్చటలెల్లఁ దీరె మనకుండలనుం
- గొనివచ్చెద నని తారా, వనజేక్షణ చనియె నిజనివాసంబునకున్.76
ఉ. ఆసమయంబునం దొకవయస్య చలత్కుబరీవినిర్గళ
- త్కౌసుమపుంజముల్ చరణకంజము జాడల రాలి మారుఁడా