పుట:కుమారసంభవము.pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

85

వ. అనిన విని హిమవంతుం డుదరిపడి మేనకాసహిఠం బతిసంభ్రమంబునం జను
     దెంచునంత నిట పార్వతియును.652
మ.జగదారాధ్యు నసాధ్యు సాధ్యువిమలాచారున్ మహోదారు స
     ర్వగు సర్వేశు ననీశు నీశు సుగుణావాసుం జగత్త్రాసుఁ ద
     త్త్రిగుణాతీతు నజాతు జాతు వృషవర్ధిష్ణుం గ్రియాజిష్ణులు లో
     కగురున్ దృశ్యు నవశ్యు వశ్యు వివిధాకల్పున్ సుజల్పున్ మహిన్.653
క. సుజ్ఞనామలతత్వవి, ధిజ్ఞుఁ గళాభిజ్ఞు భారతీరమణుఁ ద్రిలో
     కజ్ఞు నయజ్ఞు సుధీనిధి, నజ్ఞానవిముక్తు సుచరితాభరణాంకున్.654
క. కరుణామిత్రునమిత్రు మిత్రు నుతలోకజ్ఞుం గళాభిజ్ఞు సా
     గరగంభీరు నదూరు దూరగతదోఘన్యున్ జగన్మాన్యు భూ
     సురవంశాద్యు నభేద్యు భేద్యు సుమనఃశుద్ధున్ మనఃశుద్ధు వి
     స్తరితశ్లోకు నలోకు లోకు శివసంసక్తున్ విముక్తున్ మహిన్.655
క. లోకాలోకనకీర్తి, శ్రీకాంతాకాంతు విబుధశేఖరు దురితా
     సోకహకుఠారు సకలక, ళాకల్పాకల్పు మల్లికార్జునదేవున్.656
మాలిని. అమలపరమయోగాయత్తు సంశుద్ధచిత్తున్
     గమలవిశిఖరమ్యాకారు దుస్పంగదూరున్
     శమితవిషయుఁ దత్త్వాసక్తు సంసారముక్తున్
     శమదమనియతాత్మున్ శాంతువాక్శ్రీసుకాంతున్.657
గద్యము. ఇది శ్రీమజ్జంగమమల్లికార్జునదేవదివ్యశ్రీపాదపంకజభ్రమరాయమాణకవిరాజ
     శిఖామణి నన్నెచోడదేవప్రణీతం బైనకుమారసంభవం బనుకథయందుఁ బంచ
     మాశ్వాసము