పుట:కాశీమజిలీకథలు -09.pdf/84

ఈ పుట ఆమోదించబడ్డది

12]

జయంతుని కథ

89

జయం - నే నెందుఁ దప్పితినో చెప్పమని యడుగుచుండ నేమేమో ప్రేలెదవేల?

పక్షు -- దేవా వినుండు

శ్లో॥సతీ మనసి తన్వింగి సఖి ప్రాగపివర్తతే
     స్తనవక్త్రం విశాలాక్షి యత్తే శిఖిపదాంకితం

దంతనఖాంకాదుల కాయాస్థానంబులు శాస్త్రంబున నిరూపింపబడి యున్నవిగదా! దాని నతిక్రమించి మీరు వర్తించితి రింతకన్న నేమి జెప్పఁగలము గన్నులారఁ జూచితిమి.

జయం కుంకలారా! ఇదియా మీరు పెట్టినవంక చాలు చాలు. మీరెన్ని శాస్త్రములు జూపితిరి.

సూ. ప్రవృత్త రతిచక్రాణాం నస్థాన మస్థా
      సంవా విద్యత ఇది సువర్ణనాభః

అని యున్న సూత్రమును జదివిన నిట్లాక్షేపింపక పోపుదురే? బుద్ధిమాలిన యచ్చరలు వచ్చి మిమ్మడిగినంతనే మా కేమియుం దెలియదనక మహాపండితులవలె న్యూనాధిక్యవివక్ష దెలియం జేయుట మీది తప్పు నందనవనవాసము వలన నాలుగు శ్లోకము లెట్లో చదువఁ గలిగిరి. అంత మాత్రముననే సర్వజ్ఞత్వము ప్రకటించుకొన వలయునా? మీ యందు రెండు తప్పులు గనంబడుచున్నవి. పొంచి యుండి బరులక్రీడలఁ జూచుట యొకటి లెస్సగాఁ దెలియక తగవు జెప్పుట యొకటి యీ యపరాధద్వయమునకై మిమ్ము శపించుచుంటి మీరీ కల్పకోటరవాసమున కర్హులుకాదు. పో. పొండు. పరకామప్రేక్షణంబునఁ జేసి చిరకాలవియోగము వహింతురుగాక. అధర్మకథనంబున భూలోకకాంతారముల భ్రష్ట్రులై సంచరింపుదురు గాక.

అని శపించిన విని యా పక్షులు రక్షింపుమ రక్షింపుము మేము ఎఱింగి పక్షపాతము చెప్పలేదు. నారదమహర్షి మాటదలంచి యీ తగవరి తనములకుఁ బూనికొంటిమని యెంత బ్రతిమాలుకొనినను జయంతుని యలుగు దీరినదికాదు. ఆ ప్రాంతపాదపము క్రిందఁ దపము జేయుచు నా సంవాదమంతయు నాలించుచున్న యొక సిద్దుండు క్రుద్ధుండై యోరీ! యింద్రపుత్రా! మహైశ్వర్యగర్వంబునం జేసి నిరవద్యవిద్యాక్షేత్రములగు పారావతపతత్రముల నిష్కారణము దారుణశాపపాత్రములఁ జేసితివే? అప్పులుగుల పలుకులయం దేమి లోపమున్నది? నీ వింద్రసూనుడవని పక్షపాతము జెప్పవలసినదియా! మీ యిద్దరి కళావైదగ్యములకుఁ దారతమ్య మెఱిగింపుమని యడిగినప్పుడు క్రీడారహస్యములు నరయుట తప్పా? తప్పంతయు నీయందే కనుపించుచున్నది. వ్యాధుండవలె దయమాలి పక్షి హింసకుండ