పుట:కాశీమజిలీకథలు -09.pdf/246

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభావతి కథ

251

వాఁ డేవియో వంకలుపెట్టి యా నియమములు చెల్లవనియు న్యాయస్థానమునకుఁ బోయి చెప్పికొనినఁగాని గుర్రము నియ్యననియుం జెప్పి గద్దించెను.

వాని కపటము గ్రహించి విక్రమార్కుఁడు మెల్లిగా వాని గుర్రపుసాల యొద్దకుఁ బోయి యశ్వరత్నమా! రమ్ము రమ్ము. అని పిలుచుచు సంజ్ఞగా నీల పట్టెను. అప్పుడా కత్తలాసి కాళ్ళకుఁ గట్టిన లాతపు త్రాళ్ళం దెంచుకొని యడ్డము వచ్చిన వానిం దన్నుచు నతిరయంబున విక్రమార్కుం డున్నచోటికి వచ్చి నిలఁబడినది.

దానిం దువ్వుచు నెవ్వరికిం జెప్పక రివ్వునఁ బైకెక్కి జీనును గళ్ళెము లేకుండఁగనే సత్వరముగా నడిపించుచు నరనిమిషములో పణప్రదేశమునకుఁ బోయి నిలఁబెట్టెను. ఆ ప్రదేశమున నశ్వారోహకు లందఱువచ్చి తమ గుర్రముల శ్రేణిగా నిలఁబెట్టి యున్నారు. పదినిమిషములు మాత్రమే వ్యవధి యున్నది. జీనులేదు. కళ్ళెము లేదు. అలంకారములేదు. బికారివేషము. అట్లున్న విక్రమార్కునిం జూచి యందున్న సాదులందరు పకపక నవ్వ మొదలుపెట్టిరి.

అతం డెవ్వరివంకం జూడక సమయము ప్రతీక్షింపుచుండ నింతలో గంట మ్రోగినది. రౌఁతులు తమ తమ గుర్రములను వదలిరి. గమ్యస్థానము మూడు యోజనముల దూరములో నున్నది. అందొక యున్నత ప్రదేశమున వ్రేలంగట్టఁబడియున్న రత్నమాలికం దీసికొని ముం దిం దెవ్వరు చేరుదురో వారికి మొదటి కానుక లభించును.

విక్రమార్కుం డా మాలిక నందుకొని వచ్చుచు వారి కెదురుపడెను. ఆ వస్తువుం దెచ్చి దిరుగ రెండవమారు పోయి వారిం గలసికొని యందలి వస్తువులందక కొందల మందుచున్న వారి నతిక్రమించి చంద్రహాసాగ్రంబున బంధనరజ్జువు గోసి రత్నవలయం బందుకొని వారికన్న ముందు సభ్యులం జేరెను. తదశ్వారోహణపాటవము జూచి యందున్న సభ్యులందఱు వెఱఁగందుచు నోహో! ఈతండు దివ్యుండుగాని మనుష్యుండు గాఁడు. వీని గుర్రమునకు ఱెక్కలున్నవి కాఁబోలు. గరుత్మంతుఁడు గూడ నంతవేగము పోయిరాలేఁడే? ఆహాహా! యని యాశ్చర్యమందఁ జొచ్చిరి. రెండుపణముల నతండు గెలిచెనని సభ్యులు వ్రాసి యిచ్చిరి. అందున్న వారందఱు నతని పుష్పములచేఁ బూజించిరి. కిన్నరుఁడో సిద్ధుఁడో సాధ్యుఁడో కావలయు మనుష్యుడు కాఁడని స్తుతియింపుచుండిరి.

అంతలో నా బేహారి యతిరయంబునఁ బరుగిడుకొని వచ్చి అయ్యా! నిజము గీ గుర్రము నితండు నా కమ్మివేసెను. నా యనుమతి లేనిదే దొంగతనముగా దీసికొనివచ్చి పందెము గెలిచెను. దానంజేసి వీనిలోఁ గొంత పాలీయవలయు నని తగవుపెట్టెను. విక్రమార్కుండు వానితో నేమియు మాట్లాడలేదు. నలువురు పాఱులు