పుట:కాశీమజిలీకథలు -09.pdf/235

ఈ పుట ఆమోదించబడ్డది

240

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

దేశాటనము జేయుచు నందు వచ్చియున్న యతులఁ బరివ్రాజకుల సిద్ధుల నెందైనను వింతలం జూచి వచ్చితిరా యని యడుగుచుండును.

ఒకనాఁ డమ్మహాకాళేశ్వరుని సేవింప వచ్చిన యొక పరివ్రాజకుం గాంచి నమస్కరింపుచు నొకగేస్తు మహాత్మా! నాకుఁ దత్వోపదేశము గావించి కృతార్థులం గావింపుమని ప్రార్థించుటయు నా పరివ్రాజకుం డిట్లనియె.

ఓయీ? నీవు గృహస్థుండవు. గృహస్థధర్మములఁ జక్కగా నెరవేర్చుకొనినఁ దత్వగ్రహణాధికఫలంబు కాఁగలదు. వినుము దుర్జనసహవాస మెన్నఁడును జేయకుము. ఎవ్వరితో విరోధము వలదు.

శ్లో. అనుభవత దత్త విత్తం మాన్యం మానయ సజ్జలం భణథ
    అతిపరుషపవనలులితా దీప శిఖేరాతిచంచలా లక్ష్మీ.

నీకున్న ధనము లెస్సగా ననుభవింపుము. ఒరులకుఁ బెట్టుము. మాన్యుల సన్మానింపుము. సజ్జనుల సేవింపుము. సంపదలు గాలిలోఁ బెట్టిన దీపమువలె నతి చంచలములని తెలిసికొనుము. పరులకు సంతాపము గలుగఁ జేయకుము, అపరాధము లేక భృత్యుల దండింపకుము. రాఁబోవు దానికిఁ జింతింపకుము. శత్రువులకైన హితము గోరుము. ధ్యానాధ్యయనాదులతోఁగాక దివసము వృథాగడుపకుము. స్త్రీలకు రహస్యము జెప్పకుము తల్లిదండ్రుల సేవింపుము. దొంగలతో మాట్లాడవలదు. కొంచెము కొఱకు నెక్కుడు వ్యయము చేయకుము. ఆర్యులకు దానము లిమ్ము. ధర్మస్థానముల నసత్య మాడకుము. త్రికరణములఁ బరోపకారము తలంపుచుండుము. ఈగుణంబులు గలుగు గృహస్థుండు సర్వజనపూజనీయుండై తత్వవేత్తకన్న నుత్తమలోకము బొందగలఁడని యుపదేశించెను.

విక్రమార్కుండు ప్రచ్ఛనముగా నందుండి యమృతోపమానంబులగు నా పలుకులు విని యుబ్బుచు గొబ్బున నజ్జటి నికటంబున కరిగి సాష్టాంగనమస్కారము గావించి యి ట్లనియె.

మహాత్మా ! మీ యాకారము సర్వసంగపరిత్యాగత సూచింపుచున్నది. మీ పలుకులు వేదశాస్త్ర సమ్మతములు. సర్వతీర్థంబులు మీదక్షిణపాదంబున నొప్పుచున్నవి. మీ పాదసేవకన్న గృహస్థున నుత్తమ వ్రతంబు లేదు. మీ దర్శనము జేసి కృతార్థుల మైతిమని వినుతింపుచు మఱియు నిట్లనియె.

క. ఏ యే దేశము లరిగితి
   రేయే తీర్థములఁ గంటి రేయేనదులం
   దేయే గిరులం జూచితి
   రాయాదేశముల అలక

మహాత్మా ! మీరు జూచినవానిలో నేదియేని యాశ్చర్యకరమైన విశేషమున్న .