పుట:కాశీమజిలీకథలు -02.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

142

కాశీమజిలీకథలు - రెండవభాగము

మున నోడి పారిపోయినవార్త మన మెఱిగినదేకదా? ఇప్పుడు వాడు సేనలం గూర్చుకొని మనపట్టణము ముట్టడించుటకై వచ్చుచున్నవాడని యొకకింవదంతి పుట్టినది. దాని నిజము దెలియుటకయి చారణులం బంపితిని. మనము జేయవలసిన శ్రీపుష్పయోగోత్సవము చేయదగినదా లేక ప్రస్తుతము మానదగినదాయని యడుగగా బృహస్పతిలేచి యిట్లనియె.

దేవేంద్రా! విరూపాక్షుడు మిక్కిలి బలవంతుడగును. అట్టి ప్రయత్నము చేసినను జేయవచ్చును. అట్టి వదంతి వట్టిదని తోసివేయరాదు మనప్రయత్నములో మనముండవలయును. ఈ యుత్సవము మరియొకప్పుడు చేసికొనవచ్చును. మనవీటి మార్గములన్నియు గట్టునట్లాజ్ఞ యిప్పింపుడు అని బృహస్పతి చెప్పగా విని దేవతలందరు నాయాలోచన యుక్తముగానున్నదని యొప్పుకొనిరి. అప్పుడు దేవేంద్రుడు స్వర్గపురవాకిళ్ళన్నియు మూసివేయుటకును దేవసైన్యమంతయు నాకముచుట్టును గాపుండునట్లును, ఆజ్ఞయిచ్చి యంతటితో సభ ముగించి యింటికిబోయెను. వెంటనే యచ్చటనున్న ద్వారపాలురు సభా సింహద్వారము తలుపులు బిగించి ప్రచ్చన్నమార్గమునకు వచ్చిరి. మేమంతకు పూర్వమే వేరొకమందసము మాటునకు బోయితిమి. కావున మమ్మును జూడకయే యాతలుపు తెరచుకొని మరల మూసి వారు పోయిరి.

అప్పుడు తిలోత్తమ సంతసించుచు నన్ను జూచి ఆర్యా! మనయందు దైవానుగ్రహము గలిగియున్నది. విరూపాక్షుని మూలమున మన మీసభలో నుండి దాటిపోవచ్చును. ఈ గుప్తద్వారము తలుపున దాళము వైచియుండలేదు. కాని నందు డనువాడు సంతతము దాపున గాపుండును. కాన నేను వానిని మోహ పెట్టెదను. నీవు నా వెనుక నుండుము. నందు డందు గాపుండినచో వాని నెద్దియో మాటలసందడిని దూరముగా దీసికొనిపోయెదను. ఆ సమయమున నీవు బైటికి వచ్చి యందున్న బిత్తి మాటున నిలువుము. పిమ్మట నేను గలిసికొని తీసికొని పోయెదనని చెప్పి మెల్లన నన్ను గుప్తద్వారము దాపునకు దీసికొని పోయినది.

అచ్చట దడవి యొక మరపట్టుకొని త్రిప్పగా నాతలుపులు తటాలున దెరవబడినవి. అప్పుడందున్న నందుడు ఎవ్వరు వారని కేకలు వేయగా దిలోత్తమ పైకి బోయి నందా! నేను తిలోత్తమను నన్ను లోపలబెట్టి తలుపులు వైచితివేమి! నన్ను జూచుటలేదా యని చెప్పినది. అప్పుడా నందుడు విమర్శించి ఏమీ! నీవు మొదట సభలోనికి బోయితివా? నిన్ను నే జూడలేదె? నీవిషయమయి కనబడలేదని యందరు చెప్పుకొనుచున్నారే? నీమాట దబ్బరగా నున్నదని పలుకగా నది యోహో! నందా! నీభార్య బాగున్నదా! దానికిని నాకును మిక్కిలి స్నేహము. నీతో నామాట యెప్పు