పుట:కాశీమజిలీకథలు-12.pdf/295

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

కొని దేహరక్షణార్దమై బిక్షాటనంబుచేయుచు నాత్మచింతనంబు పరమానంద సాగరం బున దేలియాడుచుండెను. అగ్గోపాలుండును భక్త్యతిరేకంబున నా యోగివర్యునకు సపర్యయొనర్చుచు ప్రసన్నమార్గంబు నందియుండెను.


గీ. గుడము నెరజూపి బాలునకును బ్రియమున
    మందుత్రాగించి జడిమంబుమాన్పు కరణి
    కధలనుచు జెప్పి నీతియుక్తముగ జనులఁ
    గృతమతులజేయుటయె మదీప్సితవిధంబు.

చ. గిరితనయా మనోరమణ ! కిన్నరసిద్ధపిశాచ సాధ్యభా
    స్వరముఖదేవయోని పరివార ! కనద్రజతాచలేంద్ర మం
    దిర ! పురుహూతముఖ్య సురదివ్యకిరీటమణి బ్రభాలస
    చ్చరణ ! సురాపగాలలితచాధుకపర్ద !‌ కృపాపయోనిధీ !

క. మంగళము శైలజాముళి
   తాంగనకుం దారహీరహారోపశు
   భ్రాంగునకున్‌ గోరాట్సుతు
   రంగునకున్‌ సత్కృపాంతరంగున కెలమిన్‌.

క. నీగురు కృప నీద్వాదళ
   భాగము రచియించినాఁడ బావన మతి నో
   యోగినుత ! చేయు మీకృతి
   నాగగనమణీందు తారమై వెనయంగన్‌.


గద్య.


ఇది శ్రీమద్విశ్వనాథ సదనకంపా సంపాదిత కవితావిత్రాత్రేయ

ముని సుత్రామగోత్ర పవిత్ర మధిరకులకలశ జలనిధి రాకాకు

ముదమిత్ర లక్ష్మీనారాయణపౌత్ర కొండయార్యపుత్ర సోమి

దేవీగర్భశుక్తి ముక్తాఫల సుకవిజనవిధేయ సుబ్భన్న

దీక్షిత నామధేయ రచితంబగు కాశీయాత్రా చరిత్ర

మను మహాప్రబంధంబునందు పండ్రెండవ భాగము

సర్వము సంపూర్ణము.