పుట:కాశీమజిలీకథలు-12.pdf/192

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

197

అట్టి పురమున వాసవుని విధమున నధికమగు సంపద్విశేషంబు గలిగి, యాగ్నేయకసాయకయక ధరుండగుసాహరునివలె నరిబృందముల నెల్ల వశీకృతము లుగ నొనరించుకొను ప్రతాపము గలిగి, యాపూరిత శంఖస్వనుండగు హరివలె శుభ్ర యశస్సు గలిగి, శాపానుగ్రహసమర్థుండగు విరించివలె దుర్లంఘ్యశాసనము గలిగి, నిరా తపం బగు నా లోకమున నున్న మన్మధునకు హరనయనదహనదాహోపశాంతికై బొడమిన జలధరవితానమువలె నొప్పు నిజవినీలఫణాఫలకడంబరంబు గలిగి, యహి భువనమున గూడ బ్రసరింప నిచ్చఁ గొని పూర్వాద్రి నుదయించిన భానునివలె బ్రకా శించు నిజశిరోరుమండపమణికిరణచక్రుడై, యపరిమిత పరాక్రమక్రముడై , కాకోదర భటశ్రేష్టుఁడై, సురసన్మాన్యుఁడై, త్రివిష్టపభర్తకు మిత్రుఁడై, పాతాళనాయకుఁడగు వాసుకి, గాప్తుఁడై చరాచరగురుండగు శంకరునకుఁ బ్రియభక్తుడై, మహాత్ముఁడగు శంపాలునివంశమున కాభరణమైన క్షత్రియమహాస్వయమునకు మాణిక్యమై శిఖండ తిలకుం డను రాజశ్రేష్ఠుండు గలడు.

సహజముగా జలమందే నివసింప దలంపుగల కూర్మరాజు జలధిపక్షవత మున దదంగ మధనోపకరణంబగు మందరాద్రికి దిరుగుడు త్రాడుగా బరగి యప కార మొనర్చిన వాసుకి యెడల గుపితుడైనను శిఖండతిలకుని పరాక్రమం బెరింగి పరాహతశకచే సంకుచితదేహుండై నిజకటాహకర్పరంబున నడంగియుం డె గాని జగ త్రయమును దాల్చి మహాశక్తి గల యా యాదికూర్మ మా కోపమున నిముసములో వాసుకిని వానివాతాళమును గూడ రూపు మాపకుండునా ?

ఆ భయంబుననే వాసుకి పాతాళరక్షణ భారం బెల్ల శిఖండతిలకుని మూపునం బెట్టి యనాకులుడై కైలాసమున కేగి ధూర్జటికి శిఖాబంధముగా నేర్పడి సురనదీసలిల శీతలశీకర ప్రచారభాసురంబగు నాదేవుని జటావనమున సుఖముగా నివ సించి యున్నాడు. అట్టి శిఖండతిలకుడు నిజమండలాగ్రమునకు విజయకమలమువలె, భుజముల నొప్పు భూమివలె, వక్ష్షమందున్న లక్ష్మివలి, ముఖమందున్న సరస్వతివలె కంటిమీద ఱెప్పవలె, పరాక్రమమునకు వీరలక్ష్మివలె, గుణకలాపమునకు కీర్తివలె, వ్యాపారమునకు బుద్ధివలె, వ్యవహారమునకు నీతివలె, హృదయమున కనురాగమువలె నొప్పుచు సువంశసంజాతమగు మౌక్తికమువలెసువృత్తనిర్మలయై, యౌవనసంశ్రితయై, రూపపరిపూరితయై, లావణ్యపరిగతయై సాభాగ్యపరిభృతయై, వినయసంపన్నయై, సర్వలక్షణసమన్వితయై యలరారు విజయలేఖయను మానినీరత్నమును, ధర్మపత్నిగా బట్టమహిషిగా బడసెను.

ఆమె సతులకు బతియే దైవమని నమ్మి తదంఘ్రిశేవాసుషంగచిత్తయై సతీ వ్రతం బాచరించుచుండ నామెయందు దేవతలు గూడ బ్రసన్నులై యొసంగినట్లు పర మేష్టి నిజకటాక్షటంకమున జక్కదనము లెల్ల సానబెట్టి సృష్టింప, నారాయణుండు