పుట:కాశీమజిలీకథలు-06.pdf/99

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

యడు, వచ్చినతరువాతనే పోదుమని పలుకుచు నందు నిలువంబడి యతనిఁతో బరిచయము గలుగుటకై కుశల ప్రశ్నపూర్వకమైన ప్రసంగముఁ గొంత గావించిరి. సత్వవంతు డెంత సేపటికి మిత్రుండు తనయొద్దకు రామింజేసి పరితపించుచుఁ గౌరవనీయులగుమంత్రులు తన నిమిత్తము వేచియుండిరని మోమాటముఁ బెంచుచుఁ బోనిండు. నా వయస్యుం డేదియో పనిమీద జాగుచేయుచున్నాడు. ఈ కథయెరుఁగడు. మీ యేలికతో మాట్లాడి వేగమే వత్తునని పలికి వారితోఁగూడ రాచనగరి కరిగెను.

శశాంకుఁ డల్లంత దవ్వుననే యాతనింజూచి మోహ మావేశింప నవ్వికారముఁ దెలియనీయక యెదురునడచి గౌరవింపుచు పాణిగ్రహణముఁజేసి యొక పీఠంబునం గూర్చుండబెట్టి తా నభిముఖంబుగాఁ గూర్చుండెను. అప్పుడు మంత్రు లతని పరాక్రమ విశేషంబులను గుణసంపత్తి యుఁ గుణశీల నామంబులును స్తోత్ర పూర్వకముగా నివేదించిరి.

మిక్కిలి యభినందించుచు శశాంకుఁడు మేము కోరదగిన కల్పకము పెరటికే వచ్చినదే. మహారాజా ! వినుము. ఇప్పటికి బదియోజనముల దూరములో సౌగంధికమను నగరము కలదు. అప్పురమును ప్రభాసాగరుండనురాజు పాలించు చుండెను. అతండు నా తండ్రి కత్యంత ప్రియుండు. ఇప్పుడు తనపైఁ బెక్కండ్రు నరపతులు విరోధించి నిరోధింపఁ బ్రయత్నించుచున్నారట తత్సంగరమునకు మమ్ము సహాయము రమ్మని కోరికొనెను. మేమిప్పుడు కొంతసైన్య మచ్చటికిఁ బంపుచున్నారము. నీవు సర్వ సేనానాయకుండవై యవ్వీటికరిగి శత్రువులం బరిభవించి మిత్ర కార్యము సాధించుకొనిరమ్ము. నిన్నాత్మ సమయముగాఁ జూచికొనియెదమని స్తుతియించుటయు నతం డుబ్బుచు నప్పని కొడంబడినపిమ్మట నప్పుడే సర్వసేనాధిపత్యమునకు నతనిఁ బట్టాభిషిక్తుఁగావించి నూతనాంబర మాల్యాను లేపనాదులచే నలంకరించి యతఁ డెక్కను చ్చైశ్రవంబునుం బోలిన హయరత్న మొకదాని నిచ్చెను

సత్వవంతుం డాతురగమెక్కి దళంబులెల్ల దన నాజ్ఞకు లోనై వర్తింప రాజాజ్ఞబూని శుభముహూర్తంబున బయలుదేరి భూమి యదరునట్లు సేనల నడపించుచు గొన్ని పయనములు సాగించెను. ఆతని కా సందడిలో మా -------------- జ్ఞాపకము వచ్చినదికాదు.

ఒకనాడు సౌగంధిపురమునుండి రాజప్రతిణిధులు కొందరెదురువచ్చి జోహారుఁజేయుచు దేవా ! మా రేఁడు మీరాక కెదురుచూచుచున్నాడు. రాజపుత్రు లెల్ల నేకమైవచ్చి ప్రభాసాగరునితో యుద్ధము సేయుచున్నారు. శత్రుసేనలు సముద్రమువలె విరిగి పురముమీద బడుచున్నయవి. వాని నాప నోపునావికులు మా యొద్దలేవు. మీరు వచ్చుచున్నారను వార్తవిని మా యొడయఁడు ---------------- వేగఁజేసికొని రమ్మని మమ్ముఁ బుత్తెంచె. లెండు లెండని నుడువిన విని మందహాసముఁ గావించుచు నతండిట్లనియె.