పుట:కాశీమజిలీకథలు-06.pdf/330

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

దుర్గ కథ

335

కనితోఁ గాపురము చేయుచుండెను. కొంతకాలమునకు గర్భవతియై యొక యాఁడు శిశువుంగని వెనుకటిరీతి నా బాలిక నందువిడిచి యింకొక పట్టణమునకుఁబోయి వేశ్యలలోఁ గలిసి వర్తించుచుండె.

దాని కొడుకు నొకఁడును గూతుఁనొకఁడును బెంచికొని తెలియక యా యిద్దరికే వివాహము గావించిరి. ఒకనాఁడు త్రికాలవేదినియైన యోగిని వారి గ్రామమునకు వచ్చుటయుఁ బెంచుకొనిన తల్లిదండ్రులా వధూవరుల నామె కడకుఁ తీసికొనిపోయి వీరి యదృష్ట మెట్టిదో చెప్పమని యడిగిరి. అప్పు డాయోగిని దివ్యదృష్టిచే వారి సంబంధము దెలిసికొని సీ ! సీ ! యీ మిధునము గూర్చ దగినది కాదు. అన్నా చెల్లెండ్రు అని వారి వృత్తాంతము చెప్పినది. ఆ కథ విని యా బాలిక వివేకముతో నప్పుడనన్యసించి కాషాయవస్త్రము ధరించి కపర్దిని యని పేరు పెట్టుకొని యా యోగినికి శిష్యురాలై యామెతోఁ దిరుగుచుండెను.

దుర్గకొడుకు మాతృదోషంబున దుర్వ్యుసనములపాలై యౌవన గర్వమున గన్ను గానక తిరుగుచు నెరుఁగక యొకచోట వేశ్యా ధర్మమున వర్తించు దల్లితోఁ గలిసికొనియెను. వానివలన దుర్గకు మగశిశువు జనియించెను. దుర్గ వెనుకటి కారణముననే యా శిశువును వీధిలోఁ బారవేయించినది. ఉప్పరవాండ్రు ఏడ్చుచున్న యాడింభకుని తీసికొని కావడిలో నిడికొని యెక్కడికో బోవుచుండిరి. దైవికముగా యోగియై తిరుగుచున్న కపర్దిని యా బాలుంజూచి దివ్యదృష్టిచే గ్రహించి తొడ నిడుకొని యట్లు ముద్దులాడెను. విత్కరించి చూడ నా బాలునం దన్నిపావులు గలిగియున్నవి.

తన తల్లి కొడుకు కావున - సోదరుఁడయ్యెను.

తన యన్నకొడుకు కావున మేనల్లుఁడు.

భర్తకు భార్యయైన తల్లి తనకు సవతి అయినట. అట్టి సవతికొడుకు తనకు కొడుకయ్యెను. వాని కొడుకగుట - పౌత్రుఁడు.

భర్తకు తల్లిఅయిన తనతల్లి తన కత్త అయినది. అత్త మగనికి తమ్ము -------

తన భర్త కొడుకగుట - సుతుఁడు.

సు గతికి మ మగని తమ్ముంయగుటసిన గం. ల

న? వతమ్ముయతు శీ మ ఆలి ఎతయంతయు. మూండువాద: లలి" సమక్ని యజ్‌ంగిందిన కొ? న సబునవైన భత్యము భారని ల హింట్‌ కవులకు సిగ్గువవ్న


వున ర్‌ ఆని, యులేగేలచప