పుట:కాశీమజిలీకథలు-06.pdf/317

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నార - (నవ్వుచు) అట్లయిన నీ ప్రయాణ ప్రయాసము వ్యర్థమే. భూతలంబున నెక్కడను గడ్డిపర కన్నమాట లేదు.

గోపా - మరియేమైనది ?

నార - -ఆ బోజుని శత్రువులు సంగరమున నోడి గడ్డి గరచితి మని యట్లుచేయుచు శరణుఁజొచ్చుటచే నాకసవంతయు నై పోయినది. మందునకై నను గరికిపరక దొరకదు. ఆ శ్లోకము విని బోజుండుత్తర దిశకుఁ దిరిగెను. వెండియు నా కవి శ్లోకముఁ జదువుచున్నాఁడు.

శ్లో. విద్వద్రాజశిఖామణే ! తులయితుం ధాతా త్వదీయం యశః
    కైలాసంచ నిరీక్ష్యతత్ర లఘుతాం నిక్షిప్తవాన్‌ పూర్తయే
    ఉక్షాణం తదుపర్యుమాసహచరం తన్మూర్ధ్ని గంగాఝకం
    తస్వ్యాగ్రే ఫణిపుంగవం తదుపరి స్ఫారం సుధాదీధితిం.

ఓ భోజమహారాజా! నీకీర్తితూచెడు తలంపుతో బ్రహ్మత్రాసు లోనుంచి రెండవపెడఁ గైలాసము వైచెను. బరువు చాలినది కాదు. క్రమంబున దానిపై వృషభమును, దానిపై శంకరుని, ఆతనిపై గంగను, జంద్రుని, ముందర ఫణిరాజును వైచెను. లోకమునఁ దూచునప్పుడు దూనిక పూర్తికిఁ జిన్న చిన్న వస్తువులు వేయుట వాడుకయున్నది. అందువలనే కైలాసము ముదలైన తెల్లవస్తువు లన్నియు మీదు మీదుగానున్నవని యుత్ప్రేక్షించెను. అపూర్వ కల్పనా చాతుర్యంబున నొప్పుచున్న యా నాలుగు శ్లోకములకుఁ దనదేశములో నాలుగుదిక్కుల ధారవోసి భోజుం డపారసంతోషముతో దిగ్గునలేచి యతని పాదంబులకు నమస్కరింపుచు మహాత్మా ! నీకు రాజ్యమంతయు నిచ్చివేసితిని. నే నడవికిఁ బోవుచున్నాను. నీవు పాలించుకొమ్మని పలుకుటయు నా పండిత ప్రవరుం డిట్లనియె.

రాజా ! నేను రాజ్యమున కాసపడి నీ యొద్దకు రాలేదు. రాజ్యము పాలించు సామర్థమే మాయొద్దలేదు. నీవయేలు కొమ్ము. నాపై నక్కటిక యుంచినం జాలునని పలికెను. అప్పుడు బుద్ధిసాగరుండు రాజు చేసిన ప్రమాదమునకు వెఱచుచు నా రాజ్యమా కవివలన ధారాపూర్వకముగా వెండియుంగైకొని యత్తెరంగు నృపతి కెరింగించెను. అప్పుడు భోజుండు కవీంద్రా ! నీ పేరేమి? ఎందుండి వచ్చితివి? ఇది మొదలు మదీయాస్థానకవిగా నుండుము. నీకుఁ గావలసినంత ధనము దీసికొని పోవుచుండుమని చెప్పెను. ఆ కవి తన పేరు "కాళిదాసు” అని వ్రాసి చూపెను.