పుట:కాశీమజిలీకథలు-06.pdf/299

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

చూడవలసినదె. అచ్చేడియ మిమ్ము వరింపవలసినదే. సందియము లేదని పలికినది.

అతండు సంతోషించుచు యోషామణీ ! మంచివేషము వైచికొని యచ్చట గూర్చుండుట గాదు. పలుబారువుల కాంచనమునకు దక్కువ తీసికొని వచ్చిన వాని నా సభకు రానీయరు. పోనీ, ఎక్కడయిన నెరవు దీసికొని పోవుదమన్నను మనల నెరిగినవారులేరు. తీసికొని వెళ్ళినను నేదియో బ్రశ్న మడుగునట. అందులకు సదుత్తర మి‌చ్చిన వాని వరించునట. ఎన్ని నిబంధన లున్నవియో చూచితివా? స్త్రీల ప్రభావ మింత యద్భుతముగా నున్నదని చెప్పిన నా యుప్పులకుప్ప అయ్యో ? ఇది యెక్కడి స్వయంవరము? బంగార మేమిటికని పరిహసించి నది పోనిండు. మా పుట్టినింటికరిగి బంగారము తీసికొని రావచ్చును. మితి యిమ్మని కోరుడు ప్రశ్నమున కుత్తరము మీరు చెప్పకపోలేరు. నేను గూడ సభకు రావచ్చునా ? యని యడిగిన బోజుండు వికసిత ---- బోజుండై అంబోజముఖీ! నీ చిత్తమరయు తలంపుతో నడిగితిని. నీ సావాసగుణమునకు సంతసించితిని. కావలిసినంత కాంచనము దెప్పించెచ జూడుమని చెప్పి యప్పుడే యినుపకొట్ల యొద్దకరిగి నిలువయున్న లోహ మంతయు బట్టికి దీసికొని యొకచోట రాసిగా వేయించి సర్పటి యిచ్చిన ధూమవేది ‌ప్రభావంబున నాలోహవస్తువులన్నియు గనకవికారములు గావించెను.

పిమ్మట నా వీటనున్న శకటములన్నిటిని దెప్పించికోశాగారము నొద్ద కా బంగారమంతయు దోలించె. గుణపములు గొడ్డళ్ళు పారలు లోనగు వస్తువులన్నియు గాంచన వికారములై వచ్చుచుండుట దిలకించి మంత్రులు వెఱగుపడుచు నీ రాజకుమారు డెవ్వడో యైంద్రజాలికుడువలె గనంబడుచున్నాడు ఈ వస్తువులు కోశాగారములలో బట్టవు. ఈ బళ్ళ కంతము గనంబడదు. కోట యంతయు నిండుచున్న ట్లున్నది. వీని కేమి లెక్కలు వ్రాయగలము. అని యాలోచించుకొని యా కథ జిత్రాంగదున కెరింగించిరి. అతండును ఆ బంగారవస్తువుల జూచి విస్మయముఁ జెందుచు నీ ధర్మము బంపువాఁ డెవ్వడో చూడవలయునని తలంచి తెలిసికొని బోజకుమారుని యవసధంబున కరిగెను. ఆ రాజపుత్రు --------- విని‌ యెదు రేగి తగురీతి సత్కరించెను.

చిత్రాంగదుఁ డా బోజునిఁ జూచి తదీయరూపవైభవమున కక్కజము జెందుచు నోహో? ఈతండు భేదరుఁడు కాని భూసురుఁడు కాడు. ఈ స్వయంవర మేమిటికి ? ఇతఁడు కోరినఁ చంద్రముఖినిఁ బెండ్లి జేయ కుందునా ? అని తలంచుచు స్వాగత మడిగి సాదరముగా రాజపుత్రా ! మీరు పాలించు ధాత్రి‌ యెద్ది? మిమ్ముఁ గన్న దల్లిదండ్రు లెవ్వరు? మీ యభిథ్యా వర్ణంబు లెట్టివి? నను ధన్యుం జేయ నరుదెంచిన దివ్యుడవని దలంచుచుంటిని. మనుష్యమాత్రున కింత బంగారముఁ జేర సామర్థ్యముండునా ? యని స్తుతిపూర్వకముగా నడిగిన బోజుండు దేవా ! బంగా