పుట:కాశీమజిలీకథలు-06.pdf/296

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సులోచన కథ

301

అప్పుడా వర్తకుఁడు అయ్యా ! తమ కాపురము ధారానగరమా ? మీ పేరేమిటి ? ఎవ్వని కుమారులు ? ఎక్కడికిఁ బోవుచున్నారని యడిగిన నతండు వినిపించుకొనక వేరెద్దియో ప్రస్తావముఁ దెచ్చెను. అప్పుడు లీలావతి వర్త కుఁడా ! వారి యబిఖ్య దాచినను నభిఖ్య దాగదుగదా ? ఎవరైన మనకేమి ? మన ప్రాణములఁ గాపాడిరి కావున మనకుఁ బ్రాణబంధువులు. మ‌న మాయనకు సేవకులము. వారెక్కడికిఁ బోయిన మన మక్కడికిఁ బోవుదుము. ఆయనకు మనల నొకదారికిఁ జేర్పక తీరదు అని యతఁడే బోజకుమారుడని నిశ్చయించి యా సుందరి వాక్రుచ్చినది.

అవ్విషయ మతండు గ్రహించి రత్నపాలా ! మనము సాయంతనము కాకమున్న యీ యడవిదాటి పోవలయును. ఇత్తరుణికిఁ దురగమెక్కు పాటవము గలదుగదా ? మనము మగవారము నడువఁ గలము నా గుఱ్ఱము నీమె నెక్కుమనుమని పలికిన నక్కలికి యందుల కియ్యకొనినదికాదు. అందరు పాదచారులై పోవఁ దొడంగిరి. కింకరుడొకడు గుఱ్ఱమును వెంటఁ దీసికొని వచ్చుచుండెను. సాయంకాలము కాకమున్న వెనుకటిపల్లి కరిగిరి అందలివారు వీరింగాంచి తమ్ముబఁట్టు కొనుటకై వచ్చిరని తలంచి యూరువిడిచి పారిపోయిరి. లీలావతియెక్కి వచ్చిన వెక్కిరింత యందేయున్నది. ఆ రేయి వారందు వసించిరి. మరునాడుదయ కాలంబున బోజుం డయ్యం బోజముఖితో బోటీ ! మేము వేరొక చోటికిఁ బోవుచుంటిమి. నీ వీ గుఱ్ఱమెక్కి మీ పుట్టినింటి కరుగుము. తోడు పంపెద నన నవ్వనిత వినతాననయై జనమనోహరా ! శరణాగతుల విడిచిపోవుట యుచితమా ? పుట్టినింటి కరుగుదాన నైతినేని దొలుతనే యిల్లు వెడలక పోవుదును, నాకు మీతోడిదగతి. మిమ్మే భగవంతునిగాఁ జూచుకొందు. కపటము విడిచి మాట్లాడుడని కోరినది. అతఁడు నవ్వుచుఁ బువ్వుబోణీ ! నీ మాటలు వింతలుగా నున్నవి. చలచిత్తురాలవా యేమి? బోజకుమారుని గురించి బయలుదేరితినని చెప్పితివి ఇప్పుడు నీ వేగతియని నాతోఁ బలికితి వేమిటికి? స్త్రీ చాపల్య మిదియేనా? అని యెక సక్కెము లాడెను. అ య్యువతి దేవా! మీరు ధారానగర వాస్తవ్యులుగదా ? మీకును వారికిని సంబంధము గలిగి యుండకపోదు. మీరే వారని తలంచి యనుసరించి తిరుగుచుంటినని యేమేమో యుపన్యసించెను. ఆ సతీమణి యుక్తివచనములకు సంతసించుచు బోజుండు అంబోజముఖీ? నీవు నా నిమిత్తముఁ గడునిడుమలఁ గుడిచితివి. ఇఁక నిన్ను బరితపింపఁ జేయుట పాడిగాదు. నేనే బోజుండ నీవు గ్రహించి యుంటివని తెలిసికొంటి. నిన్నుఁ బట్టమహిషిగా స్వీకరింతు. నీ విప్పు డింటికిఁ బొమ్ము. నేను మా మేనమామగారి యింటి కరుగుచుంటినని చెప్పినఁ