పుట:కాశీమజిలీకథలు-06.pdf/293

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నీకుఁ దపంబున కిది యవసరముగాదు. నాపేరు సర్పటి యండ్రు. మోక్షేచ్చ నిందుఁ దపం బొనరించుచున్నాఁడ. నాకు నీయం దనుగ్రహము గలిగినది. నీ వినయమునకు మెచ్చుకొంటిని. నీకు ధూమవేదియను “సిద్ధి” నుపదేశింతు. నొక యోషధి దీపము పై వైచితివేని యా వెలుగు తగిలిన లోహంబు లన్నియుఁ గాంచనములగును. మరియు నీ సిద్ధివలన లోకవిఖ్యాతి వడయుదువు అని పలుకుచు నా సిద్ద ప్రపరుండా సిద్ధి నతని కుపదేశించి తపఃప్రభావసంజనితములై న పదార్థములచే భోజుం దృప్తుం జేసి పొమ్మని యానతిచ్చి యత్తాపనుండు వెండియుఁ దపంబు జేయఁ దొండగెను.

భోజుండును గ్రమ్మర భూజము మూలమున కరుదెంచి యత్తేజమ్మొక మోషధీ విశేష మని కింకరుల కెరింగించి తురగారూఢుండై వారితోఁగూడ బయలు వెడలి వడిగాఁబోవుచు నా సిద్ధివలన లోకంబున దరిద్రులు లేకుండఁ జేయుదునని సంకల్పించుంచుండెను. అట్లు గొంతదూరము పోయి మార్గాన్వేషణము గావింపుచున్న సమయంబున నొకకొండ దాపున మమ్మీయడవివాండ్రు చంపుచున్నారు. పుణ్యాత్ము లెవరైన వచ్చి రక్షింపరే ? యని యొక యార్తనాదము వినంబడినది. ఆ ధ్వని విని భోజకుమారుండ తిరయంబున హయంబు నా దెసకు నడిపించుచుఁ గింకరులతోఁ గూడ ముహూర్తకాలములో నావిపన్నుల యొద్ద కరిగెను.

అందొక కొండదేవత గుడి యెదుటనొక పురుషుని స్త్రీని మెడకు నింబ పల్లవములఁ గట్టి బలి యిచ్చుటకుఁ గొండవాండ్రు ప్రయత్నించుచుండిరి. పురుషుఁడు గిలగిలఁ గొట్టుకొనుచుఁ గేకలు వైచుచుండెను. స్త్రీ దుర్గకు సాష్టాంగ మొరిఁగి మోడ్పు చేతులతో వివశయై పడియుండెను. అట్టి సమయమున నాయుధహస్తులై యరుదెంచిన యా వీరపురుషుల మువ్వురం గాంచి యయ్యాటవికులు వెఱచి తలయొక దెసకుం బారిపోయిరి. అప్పుడు భోజకుమారుండు. కింకరులచే నా పురుషుని కట్లు విప్పించి యోయీ ? మీ రెవ్వరు? ఈ మహారణ్యమున కేమిటికి వచ్చితిరి ? అ చిన్నది నీకేమి గావలయును ? మీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిని నతండు నిటలతటఘటితాంజలి పుటుండై యిట్లనియె.

మహాత్మా ! మీరు శమనలోకాతిధులమైన మమ్ము వెనుకకు లాగికొని వచ్చితిరి. ప్రాణదానముఁ గావించిరి. నా కాపురము ధారానగరము. నేనొక వర్తకుఁడను. నా చిన్నది యెవ్వతియో నాకుఁ దెలియదు. రాచకుమార్తెయని యూహించుచున్నాను. పురుషవేషమువైచికొని యశ్వారూఢయై యెక్కడికో పోవుచు మార్గమధ్యమునఁ జోరులఁ బెక్కండ్రఁ బరిమార్చి నా యిక్కట్లఁ బాపినది. నేనామెను బురుషుఁడనియె