పుట:కాశీమజిలీకథలు-06.pdf/289

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

గినదట. గాలిసోకి లేకి వచ్చినది. సోదెకుఁ బోయిరక్షరేకుఁ గట్టింపుము లేకున్న గర్భమునకు మోసము రాగలదని చెప్పినది.

అతండు భయపడుచు అత్తా ! నీవు నాకు సహాయము రావలయును. ఇట్టి గొడవ లేమియు నాకుఁ దెలియవని కోరిన నామె యంగీకరించిసది అప్పుడే యీ యిరువురు సోదె చెప్పు దాని యింటికిం ‌ సాంబ్రాణిని పొగవైచి రాధికకు జ్వర మేమిటికి వచ్చెనో పెద్దలో పేరంటాండ్రో కనంబడి కావలసినవాని నడిగి పెట్టించుకొనుడు ఊరక గెర్భిణీ స్త్రీని బాధింపకుడు. అని పలుకుచు నామె శకున మడిగినది. ఆ సోది కత్తెయు నాపె మాటలు గ్రహించి యావేశములో తాను సులోచననియు సవతి యౌన్నత్యము చూడలేక పట్టికొంటిననియు గర్భము చెడగొట్టెద ననియు దనకు దిగతుడువు వెట్టి పుట్టెడు పట్టికి దనపేరు పెట్టినచో దొలుగుదు ననియు నేమేమో వాక్రుచ్చిసది. అప్పుడు ప్రజ్ఞావంతుడు కన్నీరు గార్చుచు దన భార్య నిజముగా వచ్చి యెదుర నిలిచినట్లు భావించుచు దా నా పై విషయమై పడిన దుఃఖమును ప్రకటించుచు గోరినదానికి నిబ్బడిగా నిత్తునని చెప్పి ప్రార్థించెను. దైవజ్ఞము వారికిం జెప్పవలసిన విధు లన్నియు జెప్పినది

ఇంటికి వచ్చి ప్రజ్ఞావంతుడు రాధికతో నా వృత్తాంత మంతయు జెప్పి మీదు గట్టి తీర్పవలసిన క్రియలన్నియు దీర్చెను. దైవికముగా నా రాధిక ప్రసవమైన వెంటనే యా శిశువు సమసినది. అప్పుడు రాధిక మిక్కిలి దుఃఖించుచు సవతిం దిట్టుచు సవతిబంధువుల నెత్తిపొడుచు నవ్విషయమై మగనితో దగవులాడ దొడంగినది. అప్పు డప్పుడు సులోచన రాధిక కావేశమై రాధికను బ్రతకనీయను. నా లోకమునకు దీసికొనిపోయెదనని ప్రేలించుచుండెను. జపములు చేయించి హోమములు గావించి రక్షరేకులు గట్టించి ప్రజ్ఞావంతుడు భార్య విషయమై పెక్కు చిక్కులు పడుచుండెను.

రాధిక కమ్మర గర్భవతియైనది. అప్పుడా ప్రజ్ఞావంతుడు మంత్ర శాస్త్రజ్ఞుల సన్యాసుల బైరాగులు నాశ్రయించి రక్షరేకులు విభూతులు నెన్నియేని బెట్టించెను. చివరకు రాధికకు గర్భస్రావమైనది. సులోచన రాధిక కావేశమై సంతతము విడువక ప్రేలింపుచుండెను. ఎక్కడికి బోయి శకునమడిగినను సులోచనయే గద్దెకు వచ్చి తాను రాధికను బ్రతుకు నీయనని చెప్పుచుండును. రాధికకు నిద్రాహారములు తగ్గినవి. రక్తమాంసములు కృశించినవి. అవయవము లన్నియు రక్షరేకులతో నిండియున్నవి తుద కెక్కడనో సోదెలో సులోచన గనంబడి సేతుస్నానము జేసినంగాని విడువనని చెప్పినది. ఆ మాట విని ప్రజ్ఞావంతుండు కొంతసొమ్మప్పు దీసికొని భార్యతో గూడ సేతు యాత్రలకు బయలుదేరి పోవుచు నొకనాడు సాయంకాలమునకుఁ గుంభకోణము జేరెను.