పుట:కాశీమజిలీకథలు-06.pdf/278

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

లీలావతి కథ

283

భూసురులు వచ్చిరని చెప్పిరి. శుభలేఖలు కూడఁ దెచ్చిరని దెలుపుటయు లీలావతి నమ్మక యా లేక లిటుతెమ్మని యడిగినది. ఆమెయు నొక పరిచారికను భర్తయొద్ద కనిపి యా పత్రికం దెప్పించినది.

అందు నా కుమారునకు మీ కూఁతురు లీలావతిని వివాహము చేసికొనుట కంగీకరించితిని. ఈ లేఖలో వ్రాసిన సుముహూర్తమునకుఁ బెండ్లి కి వచ్చుచున్నాము ముంజుఁడు అని యున్నయర్దమును విమర్శించియిందుభోజకుమారునకనిబేరువ్రాయక పోవుట సందియముగా నున్నది. తన కుమారుఁడు మరియొకఁ డున్నాఁడేమో ? వాని నిమిత్తమై యంగీకరించెనేమో తెలిసికొనవలయును నేను కోరినవాఁడు భోజుఁడు ఇదిగో ? వాని‌ చిత్రఫలకము. చూడుము. అని చూపుచుఁ జామంతిక పోయివచ్చి చెప్పినమాట లన్నియు నెరింగించినది.

పో, పొమ్ము. ఎక్కడిదానవు అమంగళపు మాటలాడెద వేమిటికి ? మరియొకని వెదకి పెండ్లి చేయవచ్చును. వానిజోలి మన కేలయని మందలించిన తల్లి కి లీలావతి అమ్మా? బ్రతికియున్నచో బోజకుమారుని బెండ్లి యాడెద. లేనిచో నిట్లే బ్రహ్మచారిణినై యుండెదగాని యొరుని వరింపనని పలికినది. అవ్విషయమిరువురు పెద్దతడవు తగవులాడిరి. ఎంతచెప్పినను లీలావతి యంగీకరించినది కాదు. అవ్వార్త యామె భర్త కెఱింగించినది. బాహ్లీకుండు వార్తాహరులఁ గొందర ధారానగరమునకు బోయి భోజుని వృత్తాంతమును దెలిసికొని రమ్మనిపంపెను.

ఆ భటులు పటురయంబున ఘోటకము లెక్కిపోయి వచ్చి దేవా! బోజకుమారుని జంపించి ముంజుఁడు పశ్చాత్తాపముఁ జెందుచు నగ్నిఁజొచ్చుటకు సిద్ధముగా నున్నాఁడు. మనమా గొడవ తలపెట్టవలసిన పనిలేదు. వేరొకయోచన సేయుఁడని వ్రాఁకుచ్చిరి. ఆ కథ విని యా రాజుమిక్కిలి వెఱగుపడుచు మంత్రులతో నాలోచించి పుత్రికకుఁ జెప్పకయే వేరొక సంబంధము నిశ్చయించి యాముహూర్తమునకే పెండ్లిచేయు నట్లేర్పరచెను.

ఆ వార్త దాసీముఖముగా విని లీలావతి యొరుని బెండ్లి యాడుట యిష్టము లేని దగుట వివాహముహూర్తము రెండు మూడు దివసములున్నదనఁగా నెవ్వరికిం దెలియనీయక వేకువజామున లేచి కోట దాటి చురుకుగల యొక తురగము నెక్కి యొక యరణ్య మార్గమునఁ బోవఁ దొడంగినది.

దృఢనిశ్చయులగు తరుణుల చిత్తము మరలింప విరించితరముగాదు. ఆ చిన్నది యశ్వారోహణమందును, ఆయుధ ధారణము నందును, బాల్యమునందె లెస్సగా శిక్షింపబడి యున్నదగుటఁ జేతఁగౌక్షేయకము ధరించి యతి వేగముగా గుఱ్ఱమును దోలుచుండెను. ఆమె వేషము చూడఁ బురుషుడో స్త్రీయో తెలిసికొను దుర్ఘటముగా నున్నది.

అం )లమీతుయంబరతల వ మర్యవ న దనుక నేకరితి నట్లు పోవుచుండ

ను నషతోవ. ాగినడి. కోంత నవ్వరిగి ‌ కొంటాం టల నించో ( పప్పీ గుం