పుట:కాశీమజిలీకథలు-06.pdf/274

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయంతుని కథ

279

స్వస్తిశ్రీ ముంజు మహారాజువారి‌ సన్నిధికి బాహ్లీకుఁడు వ్రాయుశుభ లేఖార్దములు. మీ రంపిన మీ పుత్రుని చిత్ర ఫలకముఁ జూచి మిక్కిలి యానందించితిమి. మదీయ పుత్రిక లీలావతిని మీకుమారున కిచ్చుట కనుమోదించితిని. ముహూర్తము నిశ్చయించి తరలి రావలయు నివియే పదివేల శుభ లేఖార్థములు---బాహ్లీకుడు.

ఆ వార్తవిని సభాసదు లందరు పుత్రుం డనభోజుఁడా ? జయంతుఁడా ? యని సందేహ మందుచుండిరి. భోజుఁడనియే నిరూపించిన వారు కన్నీరు విడువఁ దొడంగిరి. ముంజుఁడునుతి డోలాయిత మనస్కుడై యొక్కింత తడవు విచారించి మీ రంపిన చిత్రఫలక మందినదని వ్రాయుచున్నాఁడు. వీరికి నేను చిత్రపట మెవ్వరిది పంపితినో యించుకయు జ్ఞాపకము లేదు. బాహ్లీకుని కూతురు లీలావతి కడు రూపవతియని వినియంటిమి. భీజుఁడు వరించి తనయా లేఖ్యమునంపి యుండును. పోనిమ్ము ఇందు నీ పుత్రుఁడనియే (వానిపేరు వ్రాయబడి యుండలేదు గదా) జయంతునికే యా కన్యను వివాహముఁ జేసికొందుగాక. బాహ్లీకుఁడు మా కన్నఁ బదిమడుఁగు లెక్కువ వాడు. వాని సంబంధ మన్నివిధముల నుచితముగానున్నదని తలంచుచు నాభూసురుల వలన లీలావతిచిత్రపట మందుకొని యేదియో ముహ్తూర్త మప్పుడే నిశ్చయింపఁజేసి యాపారులకుఁ గానుకలిచ్చి యంపెను.

పిమ్మట నా చిత్రపటముఁ గైకొని భార్యయొద్దకు వచ్చి ప్రేయసీ ఈ యువతిం జూచితివా? బాహ్లీకుని కూఁతురు దీనిపేరు లీలావతి. త్రిభువనాశ్చర్యకర సౌందర్యమున విరాజిల్లు చున్నది. దీని వరించి భోజుండు తన చిత్రపటంబుఁ బంపి యున్నాఁడు. బాహ్లీకు డల్లునకు మున్నూరు గ్రామములు కట్టణమిచ్చునఁట. మన జయంతున కాకాంతం జేసికొనుటకు నిశ్చయించితిని. ముహూర్తము నిరూపితమైనదని పలికిన విని యామె యిట్లనియె. నాఁ బోజకుమారుని జంపితిరని నగరమంతయు నల్లకల్లోలముగాఁ జెప్పుకొనుచున్నారఁట. ఇంతలో నీ శుభముహూర్తము నిశ్చయించిన విని ప్రజలూరకుందురా ? మొగము మీదనే యనకమానరు. అదియునుంగాక మీ కుమారుఁ డతని నిమిత్తము మిక్కిలి దుఃఖించుచున్నాఁడు. ఇప్పుడీ పెండ్లికి సమ్మతించునా? మఱికొన్ని‌ దినములు గడువనీయుడని యుపదేశించినది. అంతలో సాయంకాలమైనది. అప్పుడు వత్సరాజు రత్న కుండల సముజ్వలమగు బోజకుమారుని శిరంబు జేత నిడికొని రాజమందిరమున కరుదెంచి మహారాజా ! దేవరయానతి వడువున బోజుని భువనేశ్వరీ కాంతారమునకుఁ దీసికొని పోయి చంపితిని. ఇదిగో ? వాని శిరంబుఁ జూచికొనుమని పలికెను.

అప్పుడు ముంజుఁడు వత్సరాజు నగ్గించుచు మిత్రమా ! నీవు బోజు నెట్లు దీసికొనిబోయితివి. ఎవ్వరైన దారిలోఁ గనంబడిరా ? వానితో నేమని చెప్పితివి. ఖడ్గ ------------------ వాడేమయిన మాటలం జెప్పెనా ? సవిస్తరముగా నెరింగింపుమని యడిగిన నతఁ డిట్లనియె.