పుట:కాశీమజిలీకథలు-06.pdf/264

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవి కంఠకౌక్షేయుకుని కథ

269

పురమునఁ కరుదెంచెను. వారిరాక విని జయదేవుఁ డెదురువోయి సపరివారముగాఁ దోడ్తెచ్చి యనేక సత్కారములం గావింపుచుఁ దమప్రాసాదనమున విడియఁ జేసెను.

భార్యలు సంతానమునుజూడఁ దొందరపడుచుండఁ శర్వాణివారి నంతఃపురమునకుఁ దీసికొని పోయినది. వసుంధరుఁడును దోడన చని తన కెదురువచ్చి నమస్కరింపుచున్న ఘటదత్తుఁ గ్రుచ్చి యెత్తి పుత్రా ! నీ వృత్తాంతముఁ దెలియక నీ సుగుణములు పరిశీలింపక చేతికి దొరకిన రత్నమును శిలయని పారవై చినట్లు నిన్ను విడనాడి యతికష్టంబులఁ బెట్టితినిగదా! నీ పరాక్రమము నీ సౌశీల్యము లోకములు కొనియాడుచున్నవి. నిన్నుఁ గని ధన్యుఁడ నై తినని‌ యనేక ప్రకారముల నగ్గించెను.

తరువాత నతం డిరువుర తల్లులయొద్దకుఁ బోయి నమస్కరించుటయు వారు గ్రుచ్చియెత్తి గారవించిరి. కళావతి యతఁడు పడిన యిడుమలం దలంచి శోకించుచుఁ దండ్రీ! నీవు మహారాజుకుమారుండ వయ్యుఁ బుట్టిననాడుంగోలె నించుకయు సుఖపడక యడవులపాలై కడు నిడుమలం గుడిచితివిగదా! నీవు దొంగవని పట్టుకొని సంకెళులు వైచినప్పుడు నీవెంత చింతించితివో పట్టీ? నిన్ను గనియు నీ ముద్దుముచ్చటలు చూచుభాగ్యము నాకు లేకపోయెంగదాయని క‌న్నీరు మున్నీరుగాఁ జింతించుచున్న తల్లి నూరడించుచు నతండు తని ముద్దుచెల్లెలు చేసిన పనులన్నియుఁ జెప్పుచు వారికి సంతోషముఁ గలుగఁజేసెను.

సరోజినియు నిద్దరితల్లులచేఁ గారవింపఁబడియున్న తన్నుఁ గాపాడిన విషయము చెప్పుచు నతని సుగుణంబులఁ గొనియాడినది. ఆ లోపలనే మంజరికయుఁ బాటలికయు వారిరాక విని యెక్కడికో పారిపోయిరి సావధానముగా గూర్చుండి ఘటదత్తుఁడు సరోజినియుఁ దల్లిదండ్రు లడుగుచుండఁ వారు పడిన యిడుమ లన్నియుం జెప్పుచు వారికి దుఃఖమును సంతోషమును విస్మయమును గలుగఁ జేసిరి‌.

అంతట విజయదేవభూపాలుండు ఘటదత్తుని సుగుణ విశేషము లగ్గించుచు వసుంధరుని యనుమతి వడసి బంధువుల నందరి రప్పించి శుభముహూర్త మందింద్రదత్తాఘటదత్తులకు దేవ వైభవములతో వివాహముఁ గావించెను.

వసుంధరుఁడా వివాహపరివారము నంతయుఁ దమపురంబునకుఁ దీసికొని పోయి భూమి యంతయు మోగినట్లు సరోజినిని సుముఖునిని పెండ్లిఁగావించెను. ఘటదత్తుఁడు చంద్రవతికి మ్రుచ్చిలింపఁబడిన ధన మంతయు నిప్పించి సంతోషపెట్టెను. తన్నుఁ బెంచినఁ దల్లిదండ్రులు శారదయు భర్తయుఁగన్న వారి కన్న నెక్కుడు గారాబముగాఁ జూచుచుండ వారియెడ గృతజ్ఞుండై పితృభక్తిగలిగి యుత్తమగుణవంతులలో మొదటివాఁడుగా నెన్నుకొనఁ బడుచుండెను.

మనుమని చరిత్ర మంతయును విని కృష్ణదేవరాయలును రామలింగకవియు సపరివారముగా సౌగంధిక నగరమున కరుదెంచి వసుంధర మన్నించుచుఁ దమకు ------------------- ఘటదత్తుం గ్రుచ్చి యెత్తి మిక్కిలి గారవించిరి. అప్పుడు రామ