పుట:కాశీమజిలీకథలు-06.pdf/261

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

మరియుఁ జెప్పుము. ఈతండు పుత్రుఁడని వనుంధరుఁడెరుఁగడు కాబోలు ? బాపురే ? ఎట్టివింత వినంబడి నది. ఈ సరోజిని నిక్క_ముగాఁ దోబుట్టువనియతం డెరుఁగడు. సరోజినికిం దెలియదు. ఈ పూర్వోదంత మంతయు మీకెట్లు తెల్ల మైనది. అందులకే సరోజిని యిట్టిబుద్ధిశాలినియైనది. అని యడిగిన మాటయే యడుగుచు వినిన మాటయే వినుచుఁ బెద్దతడవు దానితో సంభాషించినది.

అట్టి సమయమున విజయదేవుఁ డా ఇంద్రదత్త యంతఃపురమునకు వచ్చి భార్యనుగూడరప్పించి సంతోషం బభినయించుచు మన ఇంద్రదత్త వరించిన ఘటదత్తుడు దొంగయని మన మదివర కనుమానముఁ జెందుచుంటిమి. అతండు బ్రాహ్మణుఁడట. భూలోకములో నతనివంటి పండితుఁడును పరాక్రమవంతుండును లేడఁట. మున్ను మన కతఁడు తస్కరుఁడని తెలియపరచిన కీర్తి సేనుఁడే క్రమ్మర నిప్పుడా వార్తఁ దెలియఁ జేసెను. వానికిఁ దన రాజ్యములో సగ మిచ్చివేసితినని తెలియఁ జేయు చున్నాఁడు. సుముఖుఁ డనువాఁడు మంత్రిత్వాధికారమిచ్చెనఁట. వాని కిప్పుడింత యేలవచ్చినది. నా రాజ్యమున కే యధికారిం జేయుచున్నానని తెలియఁ జేసెదను. సత్వరముగా రమ్మని యుత్తరము వ్రాయచున్నానని తన యభిప్రాయము తెలియఁ బరచుటయు నెక్కుడు మురిపెముఁ జెందుచు నా రాజపుత్రికతండ్రి కిట్లనియె. తండ్రీ ! నీవు నీ యల్లుఁడు బ్రాహ్మణుఁడని విననంతనే సంతసించు చుంటివి. ఆతని యధార్థ చరిత్రము వినిన నెంత యానందింతువో ? వినుము. ఆ వీరుఁడు కృష్ణదేవరాయల దౌహిత్రుండు. తెనాలిరామలింగకవి పౌత్రుండు. వసుంధరుని పుత్రుండు. మనము బోగముదాన యని వినిన సరోజని నిజముగా వాని చెల్లె లే. కుముద్వంతుని దౌహిత్రి వారిరువురు గ్రహచార దోషంబునఁ దల్లి దండ్రులనుఁ బాసి యిడుమలం గుడుచు చున్నారు. సరోజని సౌందర్యమునను బుద్ధికౌశల్యమునను ననన్య‌ సామాన్యమై యున్నదిఁ ఆమె రాజపుత్రికయగు కేమియు సందియములేదు. అని పాటలిక వలనఁ దాను వినినకథ యంతయుం జెప్పుటయు విజయదేవ భూపాలుండ పార కౌతూహలముతో నోహో ? మన భాగ్యమేమని కొనియాడఁదగినది. మహాత్ములతో సంబంధముఁ గలుపుకొంటిమి. అని పలుకునప్పుడే సరోజిని యిందున్నదనియు ఘటదత్తుం దీసికొని రమ్మనియు వేవుర దూతలంగీర్తి సేను నొద్దకు బంపెను.

సరోజినియు మాటుననుండి వారి మాటలువిని యుబ్బుచు బాటలికం జీరి నీవు మా వృత్తాంత మెట్లు తెలిసికొంటివి. నీకుఁ జెప్పిన దాది యెవ్వతియ? నీకును దానికిని నెట్టి సంబంధము కలిగియున్నది. అని వితర్క పూర్వకముగా న‌డిగిన నదియు నా చిన్నదానికి నమ్మకముఁ గలుగునట్లు చెప్పినది. సరోజిని యప్పుడే యా కృత్యముఁ గావించినవారు మీరేయని దానిమాటలచే సందేహము కలిగినది. ఇంద్రదత్తయు సరోజిని --------- గరింగించి నీవు నా కాడుబిడ్డ వైతివి. నీ కథ యెరుఁగక నిన్నుఁ దూలనాడిన నా తప్పు మన్నింప వలయునని ప్రార్దించినది.