పుట:కాశీమజిలీకథలు-06.pdf/254

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవి కంఠకౌక్షేయుకుని కథ

259

దెచ్చికొని యా ప్రాంత గ్రామముల కరిగి వెదకిరి. ఆ పేరుగల చిన్నది వచ్చిన ట్లెవ్వరును జెప్పలేదు.

అప్పు డతండు శోకప్రభంజన ప్రజ్వలిత కోపజ్వలనుండై రౌద్రావేశముతో సుముఖా ! శరణుఁ జొచ్చిన తరుణీం గాపాడలేకపోయితిని. ఇఁక నా జన్మ మేటికి ? కాళిందీపురభర్త యెవ్వఁడో మాకుఁ బూర్వజన్మ విరోధి కావలయును. మాకుఁ బెంపుఁ గలుగునప్పుడెల్ల వాని భటులువచ్చి విఘ్నములు గలుగఁజేసిరి. నేనును వాండ్రకు వెఱచి దొంగవలెనే పారిపోవుచుంటి. యశమో మృత్యువో యొకటి యిఁక నాకుఁ బ్రాపింపనై యున్నది. కావున నిప్పుడపోయి కాళిందీనగరాధీశ్వరుం బరిభవించి నాకసిఁ దీర్చుకొనియెదను. నీ విందులకు సహాయ భూతుండవై చూచు చుండుమని పలికిన విని సుముఖుం డిట్లనియె

మిత్రమా ! ప్రజలు దొంగలచేఁ బీడింపబడినప్పుడు రాజులు వారిని గాపాడవలదా ? అందులకు గోపించినఁ బ్రయోజన మేమి యున్నది ? నీవు వోయి యాత్మ వృత్తాంతముఁ జెప్పికొని తప్పించుకొనుట లెస్స అదియుంగాక ఆ నృపతి యుదంతముఁ దెలిసికొని వచ్చితిని. వాని పేరు కీర్తి సేనుఁడట. నీవు చెప్పిన వసుంధరుని మామ కుమద్వంతునకు బినతండ్రి కుమారుండఁట. వారిబలగము చాల గొప్పది. వారితోఁ బోరుట కష్టము. శాంతిం బొంది సరోజినిని మరిమరి వెదకుదమని యుపదేశించిన నతండు అయ్యో ? ఇంకెక్కడి సరోజిని. పరలోకమున సుఖించుచున్నది. మనకుఁ గనంబడదు. అని పలుకుచు నతని మాటలచే నూరటఁ జెందెను. అయ్యిరువురు క్రమంబున నయ్యంబుజాక్షి ననేక జనపదంబుల కరిగి యన్వేషించుచుండిరి. ఒక గ్రామమందు వసియించియున్న సేనలం గాంచి సుముఖుఁ డీదళములెందుఁ బోవుచున్నవని యడిగిన నందొకం డిట్లనియె.

అయ్యా ! ఘటదత్తుఁడను మహాతస్కరుఁడు గ్రామములలోఁ దిరుగు చున్నాఁడు. రెండుమూఁడు సారులు వాఁడు దొరికియుఁ దప్పించికొని పారి పోయెను. ఈ పౌజుకీర్తిసేనుండను మహారాజుది. ఆ ఱేడు వానిం బట్టికొనక మరలి మరలి రావద్దని తనయొద్దనున్న వాహినులనన్నింటింబంపి యన్నాడు. ఆ బలములు దేశమంతయుఁ దిరుగుచున్నవి. వానింబట్టికొనుటకే మేమును బోవుచుంటి మని యా కథ యంతయుం జెప్పెను.

ఆ వార్త విని ఘటదత్తుఁ డత్యంతోత్సాహముతో నా సేనలోని యొక యశ్వమును లాగికొనిపోయి దానిపయి నెక్కి కృపాణియై తన పేరుఁ బ్రకటించుచు నా సేనల నడుమనుబడి మారి మసంగినట్లు శిరంబులు నరికియు బాహువులు చెక్కియుఁ బదంబుల నేసియు నడుముల ఖండించియు ముహూర్త మాత్రములో నా బలములనెల్ల ------- పెంటలఁ గావించెను. గోగ్రహణంబునఁ బాండవ మధ్యముడు