పుట:కాశీమజిలీకథలు-06.pdf/236

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(31)

ఇంద్రదత్త కథ

241

యింట నుండఁ జూచి వాని సొబగునకు మెచ్చుకొనుచు నీ చిత్రఫలకమును వ్రాసితిని. నీవు కోరితివేని దూతికాకృత్యమునిర్వర్తించుచు నీకు వానిం జూపించెదనని చెప్పినది. ఆ మాట విని యా పాటలగంధి యొక్కింత యాలోచించి సరోజినీ ! నే నెల్లుండి శుక్రవారమునాఁడు సాయంకాలమున దుర్గాదేవి యాలయంబునకు నరుదెంచి నప్పటి కిప్పురుషరత్నము నచ్చటికిం దీసికొని రాఁగలవా యని యడుగుటయు నప్పొన్నికొమ్మ ప్రయత్నించి చూచెదం గాక నాకును గ్రొత్త వాఁడు గదా యని కొంత యాసఁ గొలిపి సెలవంది‌ యింటికివచ్చి య‌త్తెరఁ గంతయు ఘటదత్తున కెరింగించినది.

అతం డత్యంత్సుకముతో నా రెండు దివసంబులును గడిపి శుక్రవారమునాఁడు మనోహరముగా నలంకరించుకొని దుర్గాలయమునకుం బోయి యింద్రదత్త రాక కెదురు చూచుచుండెను. సరోజినియు నంతకుముందే రాజపుత్రికయొద్ద కరిగినది.

ఆ పురుషసింహుఁడు గనంబడెనా ? మాటలాడితివా ? రమ్మని చెప్పితివా? యని యడిగిన నప్పడఁతియు అబ్బా ! ఇందునిమిత్త మై గ్రామమంతయుఁ దిరిగి చాల శ్రమపడితిని. ఎట్టికే నతని వెదకి పట్టుకొంటిని. అతండు సామాన్యముగా నాతోమాట్లాడునా ? మహావిద్వాంసుఁ డతనియొద్ద మర్మ ముంచి చెప్పనలవియా ? అతఁడొక మహాదేవేంద్రుని కుమారుఁడఁట. నీ యదృష్టము పండినదిలే. ఎట్లో యొప్పించితిని. నీ జవ్వనము నీ రూపము నీ విద్యలు గురించి పెద్దగాఁ గై వారముఁ జేసితిని. లెమ్ము లెమ్ము. జాగుఁ జేసితియేని యతండు మఱియెక్కడకేని‌ బోఁగలఁడని సరోజిని చెప్పినది.

ఆ మాట విని యాబోటి సంభ్రమముతో నలంకారముల వ్యత్యాసముగా ధరించుచుఁ దెలిసికొని నవ్వుచు వినిమయము సవరించుకొనుచు నద్దముఁ జూచుకొని మరియు మరియు దిద్దుకొనుచుఁ జీరయు రవికెయుఁ బలుమారు మార్చిమార్చి కట్టి కట్టి యెట్టకే నొకదినుసు సింగార మంగీకరించి జగన్మోహనాకారముతో నొయ్యారముమీర నుత్తమాశ్వంబులఁ బూన్చిన యరదంబెక్కి సరోజినితోఁగూడ నక్కోవెల కరిగినది. అప్పుడు రాజభటులు అమ్మవారిసేవకై భర్తృదారిక వచ్చినది. పురుషు లెవ్వరు నిందుండఁగూడ దవ్వలికిఁ బొండని కేకలు వైచుచు వెదకి వెదకి యందున్న వారినెల్ల వెధికి గెంటుకొనిపోయిరి.

ఘటదత్తుఁ డంతకమున్న యా యావరణములోనున్న భైరవాలయములోఁ జేరి తలుపులుఁ జేరవైచికొని విగ్రహముమ్రోల వేదికపైఁ గూర్చుండెను. ఇంద్రదత్తయు వాడుకప్రకారము పదక్షిణపూర్వకమగా గుడిలోఁ బ్రవేశించి స్తుతిపూర్వకముగా సహస్రనామార్చనఁ జేయుచుండెను. ఘటదత్తుఁడు కవాటరంధ్రమునుండి

నష్ట దా చిని ఆచి చంచర్న కరచిధిం ఎ, ఎవయంపై కా

ఇంద్రదత్తయు నట్లమ్మవారి నర్చించి ప్రసాదము స్వీకరించి సరోజిని