పుట:కాశీమజిలీకథలు-06.pdf/219

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

దెలిసిన నా కిట్టి నికృష్టబుద్ధి పుట్టుట పురాకృత పాతకముగాక వేరొకటి కాదు. ఇంద్రియములు నా యధీనములో లేవు. నేనేమిచేయుదును ? బ్రహ్మ కూతురు భారతిని వరించుటయు గౌతముండ అహల్యను వరించుటయు లోనగు చరిత్రాంశముల గ్రహించి నన్ననుగ్రహించిన ననుగ్రహింపుము. లేకున్న మన్మదాగ్నిచే భస్మమై నీ యెదుటనే మృతి నొందెదను. బ్రహ్మహత్యాపాతక మెక్కుడో యకార్యకరణ మెక్కుడో విచారించుకొనుమని పలికిన నక్కలికి యీషత్కోపవికృత మగుస్మితముఁ గావించుచు నిట్లనియె.

పాఱుడా ! గౌతము౦ డహల్యం బెండ్లి యాడి కామితముఁ దీర్చి కొనియెను. అది దూష్యము కాదు. నీవును మాతండ్రి నడిగి నన్నుఁ బెండ్లి యాడితివేని నీ యిష్టము వచ్చినట్లు వర్తించెదను. ఇప్పుడు నేను స్వతంత్రు రాలును కాను. ధర్మ విరుద్ధమగు కార్యము నే నెన్నఁడును జేయను. అక్రమముగా నా నిమిత్తము మరణము నొందకు మనుటయు నగ్గురుండు ప్రభావతీ ! నీ వన్నియు నెఱింగి యనిన నే నేమని యుత్తర మిత్తును ? నీ తండ్రి నాకు నిన్నిచ్చి పెండ్లి చేయునా ? అది పొసఁగెడు తెరువే‌ ? నన్ను సంతసపరుపనట్లంటివి. ధనవయోరూప విశేషాదుల నీకును నాకును జాలవ్యత్యాసము కలిగియున్నది. పద్మినీ కాంతుఁగుంతియుంబోలె నీవు నన్నుఁన్గూడుము. ఇంతకన్నఁ జెప్పఁజాల బిమ్మట నీ యిష్టమనుటయు నక్కటిలకుంతల యిట్ల నియె.

కుంతికి గలిగిన వరములు నాకున్నవియా ? నే నిప్పుడు నీ యిష్టముఁ దీర్చితి నేని నుభయముల్లోకములకుం జెడుదును. తలిదండ్రు లసహ్యించుకొందురు. కులటనైన నన్ను మగడు పరిగ్రహింపడు. చుట్టాలు పరిహసింతురు. అన్నిటి కంటె నసుచితక్రియాకరణమునకు నాయంతఃకరణము పరితపించుచున్నది. నీ చిత్తము మరలించు నిశాంతింబొందుమని బోధించిన వినియాజన్ని గట్టు వేడినిట్టూర్పులు నిగుడించుచు నిట్లనియె.

‌తరుణీ ! యుక్తులచేతను శాస్త్రములచేతను నీకు నేను సమాధానముఁ జెప్పఁజాలను. ధర్మమో యధర్మమో నాకీ బుద్ది పుట్టినది. గురుఁడనియు బ్రాహ్మణుఁ డనియు నాశ్రితుడనియుఁ బండితుఁడనియుఁ గనికరించి నన్నుఁ బ్రతికింపుము. లేకున్న నిప్పుడే నీ పాదములమ్రోలఁబడి కడతేరుచున్నానని పలుకుచు నక్కలికి యడుగులకడ జతికిలఁబడియెను.

అప్పు డప్పడతి యించుక మోకరిల్లి అక్కటా ! ఇంద్రియములు పండితునైన మోసముఁ జేయుననుమాట సత్యము. ఆహా ! యెటువంటి పండితుఁడు తుచ్చ క్రియ కుద్యోగించుచుండెను ? వీనిం బరిభవించి యరగితినేని దప్పక మృతి నొందును. అయ్యో ! దైవమా ! నే నీ యాపదనెట్లు తప్పించుకొందునని యొక్కింత సేపు తలంచి గురువర్యా? లెమ్ము లెమ్ము. ధర్మసూత్రము విచారించితిని. నీ యభిమతము