పుట:కాశీమజిలీకథలు-06.pdf/197

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

మనేక బాధలు పడుచుండ నీ మందారవల్లి మాయలకు లోనై నన్ను స్మరింపకుంటివి. నిన్నే మనవచ్చునని నిందించిన విని కళావతి యిట్లనియె.

అమ్మాఁ నేనక్కడ సర్వసౌఖ్యము లందుచుండ నీకు దుఃఖ మేమిటికి ? అత్త యత్తమగుణ విద్యాయత్త. భర్త సద్వర్తన చక్రవర్తి. సవతి భూలో మానవతి, ఇఁకనాకు గొదవ యేమునది? ఇరువురు మొకతావుననే పురుఁడు పోసికొన నియమము జేసికొంటిమి. దీనం దప్పేమి యున్నది? కౌముది నన్ను విడచి గడియ తాళలేదని తనయభిప్రాయము వివరించిన విని యాక్షేపించుచుఁ గళానిలయ యిట్లనియె.

ఆహా ! యేమీఁ నీ మోహము ? సవతి కావించు కపట మరయక దానిం గొనియాడుచుంటివా? బాపురే? నీ వైదుష్యమింత దూష్యమైన దేమి? కౌముది నిన్నిందు రాకుండ నందే పురుడు వోసికొమ్మని చెప్పిన కారణమె యెరుగనై తివిగదా? నాకప్పుడే తెలిసినది. వినుము. నీసంతానము నెట్లో చంపింపక మానదు. తా నొక్కరితయ మగని కెక్కుడు ప్రీతిస్థానమగు తలంపుఁ జెందియున్నది. నీవదియెరుంగక కౌముది యనసూయయని పొగడుచుంటివని పలికిన విని కళావతి మేను ఝల్లుమనఁ జెవులు మూసికొని అమ్మా ! యిట్టిమాట నీ నోటినుండి యెట్లువచ్చినదో తెలియకున్నదిగదా. సీ ? తమ చిత్తము ననుసరించి యెదిరి నిందింపరాదు కౌముదిగుణ మేమి తెలిసి నీ వట్లంటివి ? అది భూలోకమాతకాదా ? నా బిడ్డం గడ తేర్చిన దాని కేమి లాభమున్నది ? అసూయ యెట్టిదో యెరుఁగని యా యిల్లాలు కలలోనైన నిట్టి మాటతలఁచి యుండదు. ఇది యంతయు నీ కల్చనమనిగౌముదిం బెద్దగాఁబొగడుచుఁ దల్లిని నిందించినది.

అప్పుడు కళానిలయ యించుక సిగ్గుపడి యాహా ? దీనికి సవతియం దతిశయప్రీతి కలిగి యున్నది. ఇప్పుడు నా యభిప్రాయము దీనికిం జెప్పరాదు. ముందు వివరించెదగాక యని తలంచుచుఁ దల్లీ! నీకుఁ జెప్పువారము కాము. తోచినట్లే చేయుదువు. పోనిమ్ము. కౌముదికిఁ బుత్రోదయమైనంత జనులు తమకుఁ జక్రవర్తి పుట్టెనని సంతసింతురు. నీ పుత్రునట్లు మన్నింతురా ? అది నీకు లాఘవము కాదా ? లోకమున నెంత పేదవారైనను బ్రధమ ప్రసవము పుట్టినింట జరుపరా ? నీకు మాత్రముఁ దెలియదా ? నీవందుఁ బోరాదు. ఇందే యుండమని బోధించియు మందలించియుఁ గర్జించియుం జెప్పినది. కాని యా మానవతి యంగీకరింపక అమ్మా ! స్త్రీలకు గౌరవము భర్త మూలమున వచ్చును ? నా భర్త మహా వైభవ మనుభవింపుచుండ నాకే కొదవయును లేదు. నా పిల్లల గౌరవము గురించి పిమ్మట విమర్శింపవచ్చును. అని తల్లి మాటలకాన్నిఁటికిని సమాధానముఁజెప్పి ------------------- వెండియు భర్తవారింటికి కరిగినది. దృఢసంకల్పముగల మానవతులు తల్లి మాటలు విని పుట్టినింటనుండి మగని నిరసింతురా ?

మంజరికను బల్లవికను రహస్యముగాఁ జేరి కళానిలయ మన కళావతి