పుట:కాశీమజిలీకథలు-06.pdf/194

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌముదీకళావతుల కథ

199

మంజ -- ఆమెకు నత్తగారియందు భయభక్తులు రెండునుం గలిగి యున్నవి.

రాయ - సీ ! మూఢురాలా ? నీమాటల నేదియుం దేలకున్నది.

మంజ --- దేవా ! ఎట్టివారికిని బుట్టినింట నున్నట్లత్తవారి యింట జరుగునా ? ఆమె వలదనుచున్నను దనకు నోపిక లేకున్నను భర్తృ దారిక యత్తకుఁ బాదసేవసేయక మానదు. అప్పని సుఖమో కష్టమో మీ రెరుఁగరా ? పెక్కులేల ? భర్తను నత్తయు నన్ని పనులకు నామెనే చీరుచుందురు.

రా - చాలుఁజాలు. నీ వాచాలత తెల్లమైనది. అసూయా వివశురాలగు మీ దేవి కిట్టి మాటలఁ జెప్పి రోస మెక్కించుచుంటివి‌ ? అధిక ప్రేమలేక యన్ని పనులకుఁ జేరుట యెట్లు ?

మంజ -- అడుగిడుటకే శ్ర మపడుచుండెడి నా సఖురాలిం బలుమారు పనులకు నియోగించుట నాకుఁ జాల కష్టముగా నున్నది అది ప్రీతినో భీతినో నాకుఁ దెలియదు.

రాయలు - నీవు ఓయి కళావతిం దీసికొని రమ్ము. అంతయు దానివలననే తెలిసికొనఁ గలను.

అని యందలముతోఁ గూడఁ దగినపరివారము నిచ్చి మంజరికను గుముద్వతీ నగరమున కనిపెను. మంజరికయుఁ గ్రమంబున నవ్వీటి కఱిగి యావార్త వసుంధరున కెరింగించినది. తల్లి యనుమతివడసి వసుంధరుఁడు కళావతినిఁ బుట్టినింట కరిగి రమ్మని నియమించెను. కౌముదీ. కళావతు అక్కచెల్లెండ్రకంటె నత్యంతప్రీతితో వర్తింపుచు నాహారశయ్యా విహారముల విడువక యన్యోన్యాధిక స్నేహలతాపాశ బద్దులైయున్న కతంబున నిరువురు నొకచోటనే పురుడు పోసికొనుటకు నిశ్చయించుకొని యుండిరి.

దానంజేసి కళావతి వచ్చిన పరివారమును బంపివేయుచు ముందెప్పుడో వత్తునని తండ్రికుత్తరమును వ్రాసినది. కౌముదీకళావతు లొకనాఁడు సఖులతోఁ గూడి తూగుటుయ్యలల నూగుచు నిష్టాలాపములఁ ‌ బ్రొద్దుపుచ్చుచున్న సమయంబున మంజరిక యరుదెంచి అక్కలారా ! ఎక్కడనుండియో మనయూరొక యెఱుకలసాని వచ్చినది. అది త్రికాల వృత్తాంతములు చూచినట్లే చెప్పఁగలదఁట. మహర్షుల కైన నట్టి సామర్ధ్యము లేదని జను‌ లూరక పొగడుచున్నారు. మనసానుల కెట్టి సంతానము కలుగునో చెప్పఁగలదు. తీసికొని వత్తునా? యనుటయు నందున్న సుందరులెల్లఁ ఆ పిలువుమని తొందర పెట్టిరి.

సన్న తాటియాకులతో నల్లి న పొరలబుట్టఁ జంక నిడుకొని పూసలపేరు -------------------------- ‌ధరించి పెద్దనత్తుగదల దీవెనలం బాడుచు ---------------- నయ్యెఱుకలసానిని వెంట బెట్టికొని మంజిరిక యచ్చటికి వచ్చి