పుట:కాశీమజిలీకథలు-06.pdf/189

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

194

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

మీ రాజపుత్రిక మాకుఁ గావించిన యాతిధ్యమునకు సంతసించితిమి మాది దక్షిణ దేశము. బ్రాహ్మణులము. దేశాటనముఁ జేయుచుంటిమి. మీ యేలికసాని మాయా విద్యలలో మిగుల బ్రౌడులనివిని యీయూరు వచ్చితిని. మీరు చూచిన వింత లన్నియు నేను గావించిన జాలములే. ప్రతిజాల మేమియుఁ బన్ని మీ రాజపుత్రిక వాని సహకరించినది కాదేమి ? అని యడిగిన వినయము సూచించుచు నా వగలాడి యిట్ల నియె.

అయ్యారే ! మీ సామర్థ్య మనన్య సామాన్నమైనదిగదా ? మీ ప్రభావములో సహశ్రాంశమైనను గాంతిసేనకు లేదు. మీ కెట్లెదురాడఁ గలదు ? ఇప్పు డామె వివాహమాడు తలంపుతో నున్నది. విద్యలలోఁ దన్నెవఁడోడించునో వానిని భర్తగా స్వీకరింతునని నియమముఁ జేసికొని యున్నది. మీ కిప్పుడామె యోడినది కావున నామెకు మీరే భర్తలు. రాజ్యలక్ష్మితోఁగూడ నా చేడియఁ బాణిగ్రహణముఁ జేసికొనుఁడని చాతుర్యముగాఁ బలికిన విని యతం డిట్లనియె.

కేసరిణీ ! మీ రాజపుత్రిక చరిత్ర మంతయు మేము వినియున్నారము. పెక్కండ్ర నిదివరకే పెండ్లియాడి యున్నదఁట. న న్నెన్నవ మగనిగా భావింతువు ? నా విద్య యోలిగా నుపదేశింపపలయునా ? తరువాత నన్నుఁ జెఱసాలం బెట్టింతురా ? మీ మాయలలోఁ బడుట కేను కరభ శరభ శంతనుల గాను. టక్కరి టమారీలగాను మీ టక్కులు నాకడ సాగవు మా గురుపుత్రునిఁ జెఱసాలలో బెట్టించిర. ఇప్పు డతని విడువరేని మదీయ మా యా విద్యాపాటవంబున మీ పట్టణమంతయు నేటం గలిపెదను. చూడుమని పలికిన నులుకుచు నక్కలికి యిట్లనియె.

ఆర్యా ! మీ వద్ద నిజము దాచనేల ? మేము పెక్కండ్ర వంచకుల వంచించినమాట సత్యమే ? మా మాయకు లోఁబడక మిగిలిన వానిచే మా రాజపుత్రిక పెండ్లియాడఁ గలరు. మీ రతీతులు కావునఁ దగినవారని చెప్పితిని. దీనం దప్పేమి‌ యున్నదో? రండు. మా రాజపుత్రికం బెండ్లి యాడుడు. మా కపటంబుల గ్రహించితిరేని మాకుఁ బరివృధులే యగుదురు. అని పలికిన నతం డిట్లనియె.

బోటీ ! మేము మీ రాజపుత్రికను బెండ్లి యాడఁ దలంచుకొన్నప్పుడుగదా వారి పరిభవించుట ? మా కట్టి యనురాగములేదు. మా గురుపుత్రుని రప్పింపుమని చెప్పెను. అని గంభీర వాగ్గుంభనలచే దాని మరల మాటాడ నీయఁడయ్యె.

కేసరిణి వోయి రాజపుత్రిక కంతయు నెరింగించినది. అప్పుడామె యతం

శ తటపలైలని చింపంచుచు వన కూయోపా;సం:. అంహిలించి యనని స గాని తం చన్మాయు ల చది చంటతక పత్మికియ అం బళిన సవమానపసరపసు,